Suraj Kumar: హత్యా నేరం కింద జైల్లో.. ఐఐటీలో 54వ ర్యాంకు

Suraj Kumar: హత్యా నేరం కింద జైల్లో.. ఐఐటీలో 54వ ర్యాంకు
Suraj Kumar: సూరజ్ విజయంలో జైలు నిర్వహణ అధికారుల పాత్ర ప్రముఖమైనది.

Suraj Kumar: టైమ్ బాగోక హత్యా నేరం కింద అరెస్టై జైల్లో ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చింది. అతడిలో మార్పు కూడా అక్కడే సాధ్యమైంది. అందుకే ఐఐటీ ర్యాంకు అతడిని వరించింది.

సకల్పం ఉన్న చోటే మార్గం ఉంటుంది. హత్యా నేరం కింద బీహార్ జైలులో ఉన్న ఓ యువ ఖైదీ నిరూపించాడు. అండర్ ట్రయల్ ఖైదీ IIT-JAM 2022 పరీక్షలకు అర్హత సాధించి, AIR 54వ ర్యాంక్‌ను పొందాడు. హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సూరజ్ కుమార్ అలియాస్ కౌశలేంద్ర, మాస్టర్స్ జాయింట్ అడ్మిషన్ టెస్ట్ (ఐఐటీ-జామ్)లో AIR 54వ ర్యాంక్ సాధించాడు.

ఐఐటీ రూర్కీ నిర్వహించిన పరీక్షలో అతను AIR 54వ ర్యాంక్ సాధించాడు. సూరజ్ విజయంలో జైలు నిర్వహణ అధికారుల పాత్ర ప్రముఖమైనది. సూరజ్ మోస్మా గ్రామ నివాసి. దాదాపు ఏడాది పాటు హత్య కేసులో నిందితుడిగా జైలులో ఉన్నాడు.

ప్రస్తుతం అతడిని ఉంచిన మండల్ కర నవాడ జైలు నుంచి ఐఐటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు. పరీక్షకు సన్నద్ధం కావడానికి జైలు అధికారుల సహకారం మరువలేనిదని అంటాడు సూరజ్. కష్టపడి చదివి, అంకితభావంతో జైలులో ఉండగానే పరీక్షలకు ప్రిపేర్ కావడమే కాకుండా మంచి ర్యాంక్ సాధించాడు.

సూరజ్ హత్యానేరంపై ఏప్రిల్ 2021 నుండి జైలులో ఉన్నాడు. నవాడా జిల్లా వారిస్లిగంజ్ బ్లాక్‌లోని మోస్మా గ్రామంలో రోడ్డు వివాదంపై రెండు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఏప్రిల్ 2021లో జరిగిన దాడిలో సంజయ్ యాదవ్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

చికిత్స నిమిత్తం పాట్నాకు తరలిస్తుండగా మృతి చెందాడు. సూరజ్ తో సహా తొమ్మిది మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏప్రిల్ 19, 2021 న సూరజ్‌తో సహా నలుగురిని అరెస్టు చేసి జైలుకు పంపారు. అప్పటి నుంచి సూరజ్ జైల్లోనే ఉన్నాడు.

సూరజ్‌కి ఇది మొదటి విజయం కాదు. గతేడాది కూడా ఐఐటీ పరీక్షలో అర్హత సాధించి ఏఐఆర్ 34వ ర్యాంక్ సాధించాడు. అయితే ఆ సంఘటన అతని జీవిత గమనాన్నే మార్చేసింది. అయినప్పటికీ, అతను ఆశ కోల్పోలేదు. జైల్లో ఉండే తన ప్రిపరేషన్ కొనసాగించాడు.

AIR 54వ ర్యాంక్ సాధించడంతో, సూరజ్ ఇప్పుడు IIT రూర్కీలో అడ్మిషన్ తీసుకొని మాస్టర్స్ డిగ్రీ కోర్సు చేయవచ్చు. ఓ సంఘటన సూరజ్ జీవితాన్ని మార్చేసింది.. మనిషిగా ఎదగడానికి తోడ్పడింది.. తప్పులు చేయడం సహజం. కానీ అందులో నుంచి పాఠాలు నేర్చుకుని మెరుగైన జీవితానికి బాటలు వేయాలనేది సూరజ్ నుంచి నేర్చుకోవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story