పండగ సీజన్ వచ్చేసింది.. మార్కెట్లోకి కొత్త కార్లు, బైకులు ..

పండగ సీజన్ వచ్చేసింది.. మార్కెట్లోకి కొత్త కార్లు, బైకులు ..
దసరా, దీపావళి పండుగల సీజన్ వ్యాపారస్తులకు కలిసొచ్చే అంశం. కొన్ని కంపెనీలు కొత్త మోడళ్ల ఆవిష్కరణలపై దృష్టి పెట్టాయి.

కొవిడ్ మహమ్మారి కారణంగా గత ఆరు నెలల నుంచి వాహనాల వ్యాపారం నామ మాత్రంగానే సాగినా వైరస్ వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టడంతో మళ్లీ తిరిగి పూర్వవైభవాన్ని సంతరించుకునేందుకు సమాయత్తమవుతోంది. ఇందుకు దసరా, దీపావళి పండుగల సీజన్ వ్యాపారస్తులకు కలిసొచ్చే అంశం. కొన్ని కంపెనీలు కొత్త మోడళ్ల ఆవిష్కరణలపై దృష్టి పెట్టాయి.

ఇటలీకి చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ డుకాటీ కొత్త స్కాంబ్లర్ 1100 ప్రో, 100 స్పోర్ట్ ప్రో బైకులను భారత మార్కెట్లో విడుదల చేసింది. వీటి ధరలు వరుసగా రూ.11.95 లక్షలు, రూ.13.74 లక్షలుగా నిర్ణయించారు. ఇక వీటి ఫీచర్లు చూస్తే ఇవి 1100 సీసీ ఇంజన్, 6 స్పీడ్ గేర్ బాక్పులను కలిగి ఉంటాయి. ఔత్సాహిక బైకర్లు కోరుకునే అన్ని అంశాలు వీటిల్లో ఉంటాయని ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ బిపుల్ చంద్రా పేర్కొన్నారు. ఇప్పటికే ఈ బైకుల బుకింగ్స్ ప్రారంభించినట్లు తెలిపారు.

మన దేశ వాహన సంస్థ టాటా మోటార్స్ మధ్య శ్రేణి హ్యాచ్‌బ్యాక్ మోడల్ టియాగో 3,00,000వ కారును గుజరాత్‌లోని సనంద్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేసింది. ఇంపాక్ట్ డిజైన్‌తో రూపొందించిన మొదటి మోడల్ ఇదేనని, దీనికి మరికొన్ని ఫీచర్లు అదనంగా చేర్చామని కంపెనీ తెలిపింది. మాన్యువల్, ఆటోమేటిక్ వెర్షన్లతో మార్కెట్లోకి తీసుకువచ్చారు.

ఫోర్డ్ ఇండియా ఎస్‌యూవీ మోడల్ ఎండీవర్‌లో ప్రత్యేక స్పోర్ట్స్ కారును మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.35.10 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. దాదాపు డజనుకు పైగా మార్పులు చేసి ఈ కొత్త వెర్షన్ ను తీసుకువచ్చామని కంపెనీ వెల్లడించింది. ఏడు ఎయిర్ బ్యాగులు, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, ప్యారలల్ పార్క్ అసిస్ట్, ఫోర్డ్‌పాస్‌తో కూడిన అనుసంధానత వంటి భద్రతా ఫీచర్లను ఇందులో చేర్చారు.

టీవీఎస్ మోటార్ కంపెనీ అపాచీ ఆర్టీఆర్ 200 4వీ మోటార్ సైకిల్‌లో కొత్త బ్రేకింగ్ టెక్నాలజీ సూపర్-మోటో ఏబీఎస్ కలిగిన వేరియంట్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.1,23,500 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). అపాచీ ఆర్టీఆర్ 200 4వీలో 197.75 సీసీ సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్ ఇంజన్ 205 పీఎస్ శక్తిని 8500 ఆర్పీఎం వద్ద అందిస్తుంది. సరికొత్త టెక్నాలజీతో పాటు ఫెదర్ టచ్ స్టార్, కొత్త ఎల్‌ఈడీ హెడ్ ల్యాంప్ వంటి ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story