భారత్ రానున్నా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్

భారత్ రానున్నా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్
Antony Blinken: బైడెన్‌ టీమ్‌లో బాధ్యతలు స్వీకరించాక ఆయన భారత్ వస్తుండటం ఇదే తొలిసారి.

Antony Blinken: అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ భారత్ రానున్నారు. ఈనెల 27, 28 తేదీల్లో ఆయన దేశంలో పర్యటిస్తారు. బైడెన్‌ టీమ్‌లో బాధ్యతలు స్వీకరించాక ఆయన భారత్ వస్తుండటం ఇదే తొలిసారి. పర్యటనలో భాగంగా బ్లింకెన్ ప్రధాని నరేంద్రమోదీతోపాటు విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. కొవిడ్‌ మహమ్మారిని ఎదుర్కోవడంలో పరస్పరం సహకరించుకోవడం, భద్రతాపరమైన అంశాలు, వాతావరణ సంక్షోభం, ఇండో-పసిఫిక్ అంశాలు, ఐక్యరాజ్యసమితిలో సహకారం వంటి అంశాలపై చర్చిస్తారు.

జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌తోనూ బ్లింకెన్ సమావేశం అవుతారు. ఇటీవల అమెరికా రక్షణశాఖ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్‌ ఇండియాలో పర్యటించారు. ఆ టూర్‌ తర్వాత జో బైడెన్‌ పాలకవర్గంతో జరుగుతున్న రెండో హైప్రొఫైల్ సమావేశం ఇది. విదేశాంగ మంత్రి జైశంకర్... ఆంటోనీ బ్లింకెన్‌తో ఇప్పటికే మూడు సార్లు సమావేశం అయ్యారు. అయితే బ్లింకెన్ మనదేశానికి రావడం ఇదే తొలిసారి.

Tags

Read MoreRead Less
Next Story