Uttar Pradesh election 2022 : ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో చివరి విడత పోలింగ్‌ ప్రారంభం

Uttar Pradesh election 2022 :  ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో చివరి విడత పోలింగ్‌ ప్రారంభం
Uttar Pradesh election 2022 : ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో చివరి విడత పోలింగ్‌ ప్రారంభమైంది. 9 జిల్లాల్లోని 54 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది.

Uttar Pradesh election 2022 : ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో చివరి విడత పోలింగ్‌ ప్రారంభమైంది. 9 జిల్లాల్లోని 54 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 613 మంది అభ్యర్థులు పోటీలో నిలువగా 2.6 కోట్ల మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగుతుంది. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తోన్న లోక్‌సభ నియోజకవర్గం వారణాశి పరిధిలో ఓటింగ్‌ జరగుతోంది.

ఈ దశ పోరులో యూపీ పర్యాటక శాఖ మంత్రి నీల్‌కాంత్ తివారీ వారణాశి సౌత్​ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. శివ్‌‌పుర్-వారణాశి నియోజక వర్గం నుంచి అనిల్ రాజ్‌భర్, వారణాశి నార్త్​ నుంచి రవీంద్ర జైస్వాల్, జౌన్‌‌పుర్​ నియోజకవర్గం నుంచి గిరీష్ యాదవ్, మీర్జాపుర్​ నుంచి రామశంకర్ సింగ్ పటేల్​ పోటీ పడుతున్నారు. కేబినెట్‌ మంత్రి పదవికి రాజీనామా చేసి సమాజ్‌‌‌వాదీలో చేరిన ధారాసింగ్ చౌహాన్.. ఘోశి నుంచి పోటీలో ఉన్నారు.

వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది బీజేపీ. అటు అధికారం కోసం తీవ్రంగా శ్రమిస్తోన్న సమాజ్‌వాదీ పార్టీకి కూడా ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. నువ్వానేనా అన్నట్లు సాగిన ఎన్నికల ప్రచారంలో రాజెవరో బంటు ఎవరో తేలనుంది.

Tags

Read MoreRead Less
Next Story