Uttar Pradesh: యువతకు ఉచితంగా ట్యాబ్లెట్లు, స్మార్ట్‌ఫోన్‌లు..: సర్కార్ నిర్ణయం

Uttar Pradesh: యువతకు ఉచితంగా ట్యాబ్లెట్లు, స్మార్ట్‌ఫోన్‌లు..: సర్కార్ నిర్ణయం
Uttar Pradesh: ఓట్ల కోసం పాట్లు.. ఎన్నికల వాగ్ధానాలు.. యోగీ సర్కర్ కొత్త పథకం వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టనుంది.

Uttar Pradesh: రాష్ట్రంలోని విద్యార్థులకు, నైపుణ్యం కలిగిన కార్మికులకు టాబ్లెట్‌లు, స్మార్ట్‌ఫోన్‌లను పంపిణీ చేస్తామని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది యోగీ గవర్నమెంట్. కొత్త పథకం వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రవేశసెట్టనుంది. గతంలో సమాజ్‌వాదీ పార్టీ కూడా విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లను పంపిణీ చేసి ఓటర్లు ఆకట్టుకుంది.

రాష్ట్రంలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా, స్కిల్ డెవలప్‌మెంట్, పారామెడికల్ మరియు నర్సింగ్ మొదలైన వివిధ టీచింగ్/ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లలో చేరిన యువతకు స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు ఉచితంగా పంపిణీ చేయబడతాయని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలోని ఉన్నత విద్య, సాంకేతిక విద్య, ఆరోగ్య విద్య, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ITI మరియు 'సేవా మిత్ర' పోర్టల్‌లో నమోదు చేసుకున్న యువత కూడా ఈ ప్రయోజనం పొందవచ్చని తెలిపింది.

ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వంపై రూ .3,000 కోట్ల భారం పడుతుందని తెలిపింది. యువత సాంకేతిక విద్యా కోర్సులను పూర్తి చేసిన అనంతరం వారు వివిధ ప్రభుత్వ /ప్రభుత్వేతర సంస్థలు లేదా స్వయం-ఆధారిత పథకాలలో పనిచేయడానికి ఇవి ఉపయోగపడతాయని తెలిపారు.

"మహమ్మారి సమయంలో, వివిధ విద్యా సంస్థలు ఆన్‌లైన్ బోధనను కొనసాగించాయి. యువత దరఖాస్తు చేసుకోవడానికి డిజిటల్ మాధ్యమాలు కూడా ఎక్కువగా ఉపయోగించాల్సి వస్తోంది.

'సేవా మిత్ర' పోర్టల్ ద్వారా ప్లంబర్, వడ్రంగి, నర్సు, ఎలక్ట్రీషియన్, ఎసి మెకానిక్ మొదలైన వివిధ నైపుణ్య సేవలకు శిక్షణ ఇస్తారు. పౌరులకు మెరుగైన సేవలను అందించడం ద్వారా వారి జీవనోపాధి కోసం వారికి టాబ్లెట్‌లు/స్మార్ట్‌ఫోన్‌లు అందించబడతాయి.

ఈ పథకం కింద ప్రతిపాదిత లబ్ధిదారుల కేటగిరీలో, ఇతర వర్గాల యువత కూడా చేర్చవచ్చు. ఎవరికి స్మార్ట్‌ఫోన్‌లు అందించాలి అనే నిర్ణయం ముఖ్యమంత్రి స్థాయి ఉన్నతాధికారుల సమక్షంలో నిర్ణయించబడుతుంది.

Tags

Read MoreRead Less
Next Story