ధౌలి గంగకు మళ్లీ పెరిగిన వరద ఉద్ధృతి

ధౌలి గంగకు మళ్లీ పెరిగిన వరద ఉద్ధృతి
దాదాపు 170మంది గల్లంతైనట్లు అంచనా. ఇప్పటివరకు ప్రాజెక్ట్‌ టెన్నెల్‌లో చిక్కుకున్న 16 మందిని సురక్షితంగా కాపాడారు.

ఉత్తరాఖండ్‌లో జల ప్రళయం మహా విషాదంగా మారింది. నిన్న రాత్రి ధౌలి గంగా నది. మరోసారి ఉగ్రరూపం దాల్చింది. అనూహ్యంగా నీట మట్టం పెరగడంతో తీర ప్రాంతాలు ముంపులో కొట్టుమిట్టాడుతున్నాయి. దీంతో సహాయక చర్యలు నిలిచిపోయారు. ప్రవాహ ఉద్ధృతి తగ్గిన తర్వాత మళ్లీ రెస్క్యూ ఆపరేషనన్‌ కొనసాగనుంది. గల్లంతైనవారి కోసం ఆర్మీ హెలికాఫ్టర్లు కూడా రంగంలోకి దిగాయి. నిన్నటి నుంచి తపోవన్​ విద్యుత్​ ప్రాజెక్టు సొరంగాల్లో చిక్కుకున్న వారిని గుర్తించే పనులను కూడా నిలిపివేశారు. ఇవాళ నీటి ప్రవాహం తగ్గాక... NDRF, SDRF సహాయక చర్యలను పునరుద్ధరించనున్నారు.

దేవభూమి ఉత్తరాఖండ్‌లో జల విలయం బీభత్సం సృష్టిస్తోంది. జోషిమఠ్‌ వద్ద నందా దేవీ హిమానీనదం కట్టలు తెంచుకోవడం వల్ల.. చమోలీ జిల్లా రేనీ తపోవన్‌ వద్ద రిషి గంగా నదికి ఆకస్మిక వరదలు సంభవించాయి. ఒక్కసారిగా రాళ్లు, మంచు ముక్కలు... నీటి ప్రవాహంతో పడటంతో ధౌలిగంగ ఉగ్రరూపం దాల్చి ప్రవహించింది. రెండు జల విద్యుత్​ ప్రాజెక్టులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 170మంది గల్లంతైనట్లు అధికారుల అంచనా. ఇప్పటివరకు ITBP సిబ్బంది.... ప్రాజెక్ట్‌ టెన్నెల్‌లో చిక్కుకున్న 16 మందిని సురక్షితంగా కాపాడారు.

ఇవాళ వరద ప్రభావిత ప్రాంతాల్లో శాస్త్రవేత్తలు, నిపుణలు పర్యటించనున్నట్లు భారత వాయుసేన వెల్లడించింది. సహాయక చర్యలు ముమ్మరంగా సాగేందుకు ఢిల్లీ నుంచి రంగంలోకి దిగనున్నారు. ఇక ఉత్తరాఖండ్‌లో వరద పరిస్థితులపై కేంద్రం ఎప్పటికప్పుడు సమీక్షింస్తోంది. గంగా నదికి ఉపనదులైన ధౌలిగంగ, రిషి గంగ, అలకనందా పోటెత్తడంతో చుట్టుపక్కల గ్రామాల్లో ఆందోళన నెలకొంది. పౌరి, తెహ్రి, రుద్రప్రయాగ, హరిద్వార్, డెహ్రాడూన్‌ జిల్లాల్లోని గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలన్నింటినీ అధికారులు ఖాళీ చేయించారు. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.


Tags

Read MoreRead Less
Next Story