నూతన వ్యవసాయ చట్టాలు, రైతుల ధర్నాపై సుప్రీంకోర్టులో విచారణ

నూతన వ్యవసాయ చట్టాలు, రైతుల ధర్నాపై సుప్రీంకోర్టులో విచారణ
. మీరు చట్టాన్ని కొంతకాలం నిలిపివేయగలరా? అని ఏజీని ప్రశ్నించింది.

నూతన వ్యవసాయ చట్టాలు, రైతుల ధర్నా అంశాల్లో కేంద్ర ప్రభుత్వం చర్యల పట్ల నిరాశతో ఉన్నామని సుప్రీంకోర్టు తెలిపింది. చట్టాలకు వ్యతిరేకంగా దేశామంతా తిరుగుబాటులో ఉందని వ్యాఖ్యానించింది. కేంద్రం నూతనంగా చేసిన వ్యవసాయ చట్టాల్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లు, ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలపై సుప్రీంకోర్టులో సోమవారం మరోసారి విచారించింది. రైతులతో ఏం మాట్లాడుతున్నారని అటార్నీ జనరల్‌ను ప్రశ్నించింది.

చట్టాలు రద్దు చేయాలని తాము చెప్పట్లేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. కోర్టు జోక్యం చేసుకోవాలా..? వద్దా..? అనే అంశంపై అర్థం లేని వాదనలు వింటున్నామని వ్యాఖ్యానించింది. సమస్యకు పరిష్కారం కనుగొనడమే తమ లక్ష్యమని ధర్మాసనం తేల్చిచెప్పింది. మీరు చట్టాన్ని కొంతకాలం నిలిపివేయగలరా? అని ఏజీని ప్రశ్నించింది. చర్చల ప్రక్రియ కొనసాగిస్తున్నామని అటార్నీ జనరల్‌ సుప్రీంకోర్టుకు తెలిపారు. సందిగ్ధత తొలగింపు కోసం కమిటీ ఏర్పాటుకు ప్రతిపాదిస్తున్నామని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది.


Tags

Read MoreRead Less
Next Story