Agra: క్లాస్‌రూమ్‌లో కుప్పిగంతులు.. టీచర్లపై సస్పెన్షన్ వేటు..

Agra: క్లాస్‌రూమ్‌లో కుప్పిగంతులు.. టీచర్లపై సస్పెన్షన్ వేటు..
Agra: టిక్‌టాక్ అనేది వచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ అందరూ డ్యాన్సులు చేయడం, కామన్ అయిపోయింది.

Agra: టిక్‌టాక్ అనేది వచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ అందరూ డ్యాన్సులు చేయడం, డబ్‌స్మాష్‌లు చేయడం కామన్ అయిపోయింది. మొదట్లో ఇది చూసేవారికి కాస్త వింతగా ఉన్నా మెల్లగా అందరికి ఇది అలవాటయిపోయింది. అయితే ఆగ్రాలోని ఓ స్కూల్‌లోని టీచర్లు క్లాస్‌రూమ్‌లోనే డ్యాన్సులు చేసి ఎంజాయ్ చేసారు. దీనికి సంబంధించిన ఒక వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారి యూట్యూబ్ వరకు వెళ్లింది.

ఆగ్రా జిల్లాలోని ఓ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్‌లో ఐదుగురు టీచర్లు హిందీ సినిమా పాటలకు డాన్స్‌లు చేశారు. వీరంతా ప్రాథమిక విద్యా శాఖలో పనిచేస్తున్నారు. వీరు డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అయ్యి సంబంధింత ప్రాథమిక శిక్షా అధికారి బ్రజరాజ్ సింగ్ కంటపడింది. అయితే వీరు టీచర్ల సర్వీస్‌ రూల్స్‌ను అతిక్రమించి, విద్యా శాఖ ప్రతిష్టను దెబ్బ తీశారని బ్రజరాజ్ సింగ్ వీరిని సస్పెండ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసారు.

అదే విధంగా క్లాస్‌రూంలో డ్యాన్స్ చేయడానికి గల కారణాలును తెలియజేయాలని ఆదేశించారు. ఇందులో నలుగురు అసిస్టెంట్‌ టీచర్లు కాగా, ఒకరు హెడ్‌ టీచర్‌. మార్చి 21న జరిగిన ఈ ఘటన వీడియో వైరల్‌గా మారడంతో ఇన్నాళ్లకు బయటపడింది.

Tags

Read MoreRead Less
Next Story