కాస్త డైట్ మార్చుకో బేటా.. మరీ ఏనుగులా తయారవుతున్నావు: కూతురికి తండ్రి సరదా సలహా

కాస్త డైట్ మార్చుకో బేటా.. మరీ ఏనుగులా తయారవుతున్నావు: కూతురికి తండ్రి సరదా సలహా
బిర్యానీ గురించి కేకలు వేయడం మాని కాస్త నీ శరీరంపై శ్రద్ధ పెట్టు. నీ మనసు పరి పరి విధాలుగా ఆలోచిస్తోంది కదా..

బంగారు తల్లీ ఎందుకు ఏడుస్తున్నావు.. ఈ రోజు నీ 21వ పుట్టినరోజు.. ఎంత సంతోషంగా ఉండాలి.. నీకు ఎంతో మెచ్యూరిటీ వచ్చిందని నేననుకుంటున్నాను.. జీవితంలోకి కొందరు వ్యక్తులు వస్తుంటారు.. పోతుంటారు.. వారి గురించి నువ్వు బాధపడాల్సిన పనిలేదు.. నీ విలువైన సమయాన్ని ఇలాంటి వాటికి వినియోగించకు. మరో ముఖ్యవిషయం నీ డైట్ కూడా మార్చుకోవాలి తల్లీ.. ఈ మధ్య మరీ లావుగా కనిపిస్తున్నావు. చిన్న సైజు ఎనుగులా తయారయ్యావు.. బిర్యానీ గురించి కేకలు వేయడం మాని కాస్త నీ శరీరంపై శ్రద్ధ పెట్టు. నీ మనసు పరి పరి విధాలుగా ఆలోచిస్తోంది కదా.. అందుకే నువ్వు రోజూ హనుమాన్ చాలీసా చదువు.. అది నిన్ను ప్రశాంతంగా ఉంచుతుంది అని ఓ తండ్రి తన కూతురుకు వాట్సాప్ ఛాట్ ద్వారా సలహాలు, సూచనలు ఇచ్చారు.

రాజస్థాన్‌కు చెందిన రూపశ్రీ తన పుట్టినరోజు సందర్భంగా తండ్రి ఆమెకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ వాట్సప్‌ చాట్‌ను ఆమె గురువారం ట్విటర్‌లో షేర్ చేసింది. 'కూతురిగా నాకు అర్హత లేదు'అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. తండ్రి కూతుళ్ల అనుబంధానికి నెటిజన్స్ ముచ్చటపడుతున్నారు.. కూతురిని సరదగా మందలించడం నెటిజన్స్ ని ఆకట్టుకుంది. ట్విట్టర్ పిట్ట కూడా ఈ తండ్రి కూతుళ్ల ప్రేమకు ఫిదా అయింది.. అందుకే షేర్ అయినప్పటి నుంచి వైరల్ అవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story