ఇండియాలో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు ఏదో తెలుసా?

ఇండియాలో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు ఏదో తెలుసా?
Longest Train of India: అయితే ఇండియాలో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు గురించి మీకు తెలుసా

Vivek Express: కొత్త మందికి ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం ఉంటుంది. పచ్చని పోలాల మధ్య నుంచి వెళ్తుంటే పకృతిని అందాలను ఆస్వాదిస్తూ ట్రైన్ జర్నీని ఎంజాయ్ చేసే వాళ్లు చాలా మంది ఉంటారు. అయితే ఇండియాలో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు గురించి మీకు తెలుసా? మన దేశంలో ఎక్కవ దూరం ప్రయాణించే రైలు వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌. ఈ రైలు 4,273 కి.మీల దూరం ప్రయాణిస్తుంది. అస్సాంలోని దిబ్రూగఢ్‌ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు ఈ ట్రైన్ జర్నీ సాగుతుంది. బ్రూగఢ్‌లో మొదలైన రైలు కన్యాకుమారి చేరడానికి 5 రోజులు పడుతుంది. వివేక్ ఎక్స్ ప్రెస్ తొమ్మిది రాష్ట్రాల మీదుగా రైలు వెళ్తుంది. ఇది వీక్లీ ట్రైన్‌. ఈ రైలు మార్గం మధ్యలో 56 స్టేషన్‌లలో ఆగుతుంది.

* ఈ రైలు పర్యటనకు వెళ్తున్న ప్రదేశం ప్రత్యేకతలను ముందుగా తెలుసుకుని వెళ్తే మంచిది.

*ముఖ్యంగా అక్కడికి ప్రత్యేకమైన వంటలు, పండ్లు, అక్కడ మాత్రమే దొరికే వస్తువులను మిస్ కాకూడదు.

* ఈ ప్రయాణంలో ఉదయం టిఫిన్ మాత్రం పూర్తిస్థాయిలో తీసుకోవాలి.

* రోజంతా ఆహారాన్ని ఒకేసారి ఎక్కువగా తీసుకోకూడదు.

* ఆహారాన్ని కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు తీసుకోవాలి.

* పర్యటనకు వెళ్లే ముందు ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించాలి. ఆయన సూచించిన మందులను వెంట తీసుకెళ్లాలి.

Tags

Read MoreRead Less
Next Story