మహారాష్ట్ర సీఎం ఇంటిని కూల్చేస్తామంటూ బెదిరింపు కాల్స్

మహారాష్ట్ర సీఎం ఇంటిని కూల్చేస్తామంటూ బెదిరింపు కాల్స్
మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే నివాసమైన మాతోశ్రీని పేల్చేస్తామని బెదిరింపు కాల్స్ వచ్చినట్టు తెలుస్తుంది.

మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే నివాసమైన మాతోశ్రీని పేల్చేస్తామని బెదిరింపు కాల్స్ వచ్చినట్టు తెలుస్తుంది. ఈ వార్త ఇప్పుడు మహారాష్ట్రలోనే కాదు యావత్ దేశంలోనే కలకలం రేపుతుంది. స్వయంగా సీఎంకే ఈ కాల్ వచ్చినట్టు సమాచారం. ఈ కాల్ ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రదారి, గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం మనిషిని అంటూ కాల్ చేశారని తెలుస్తుంది. మొత్తం నాలుగు ఫోన్ కాల్స్ వాచ్చయని.. అన్ని కాల్స్ కూడా దుబాయ్ నుంచి వచ్చాయంటున్నారు. అయితే, కాల్స్ దావుద్ పేరుతో ఈ విషయాన్ని మరింత తీవ్రంగా భావించిన పోలీసులు.. సీఎం నివాసం దగ్గర భద్రతను పెంచారు. అయితే, ఫోన్ కాల్ కు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Tags

Read MoreRead Less
Next Story