రాజధాని ఢిల్లీలో రైతన్నల ట్రాక్టర్ ర్యాలీ..

రాజధాని ఢిల్లీలో రైతన్నల ట్రాక్టర్ ర్యాలీ..
సుమారు 40 రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. శుక్రవారం రోజు కేంద్రం, రైతు సంగాలు

దేశ రాజధాని దద్ధరిల్లింది.. కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న ఆందోళన 43వ రోజుకు చేరుకుంది. చలికి వణికిపోతున్నా, చినుకులు పడుతున్నా వెరవక రైతు సోదరులు తమ పోరు బాటను సాగిస్తున్నారు. కొత్త సాగు చట్టాల రద్దు డిమాండ్‌కే కట్టుబడి ఉన్నారు. ఏడు విడతలు చర్చలు జరిగినా అన్నదాత ఆశించిన ఫలితం రాకపోవడంతో పొలంలో హలం పట్టి దుక్కి దున్నాల్సిన రైతు రాత్రి పగలు తేడా లేకుండా రోడ్ల మీదే బైఠాయిస్తున్నారు.. అక్కడే వంట వార్పు కొనసాగిస్తున్నారు.

తాజాగా గురువారం దేశ రాజధాని ధిల్లీకి నాలుగు సరిహద్దులవైపు నుంచి ట్రాక్టర్ల ర్యాలీలను చేపట్టారు. సుమారు 40 రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. శుక్రవారం రోజు కేంద్రం, రైతు సంగాలు మరోసారి సమావేశం కానున్న తరుణంలో అన్నదాతలు ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు.

కాగా, వ్యవసాయ చట్టాలపై దాఖలైన అన్ని పిటిషన్లపై ఈనెల 11న విచారణ జరపనున్నట్లు సుప్రీం కోర్టు గతంలోనే ప్రకటించింది. ఇరు వర్గాల మధ్య చర్చలను ప్రోత్సహిస్తామని తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story