Subhavati Shukla : ఎవరీ సుభావతి శుక్లా.. సీఎం పైనే పోటీ ఎందుకు?

Subhavati Shukla : ఎవరీ సుభావతి శుక్లా.. సీఎం పైనే పోటీ ఎందుకు?
Subhavati Shukla : ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్ ప్రాంతం.. యోగి ఆదిత్యనాథ్‌ కి కంచుకోట.. ఇక్కడి నుంచి వరుసగా అయిదుసార్లు ఎంపీగా గెలిచి రికార్డు సృష్టించారు యోగి ఆదిత్యనాథ్‌.

Subhavati Shukla : ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్ ప్రాంతం.. యోగి ఆదిత్యనాథ్‌ కి కంచుకోట.. ఇక్కడి నుంచి వరుసగా అయిదుసార్లు ఎంపీగా గెలిచి రికార్డు సృష్టించారు యోగి ఆదిత్యనాథ్‌. ఇప్పుడు గోరఖ్‌పూర్ అర్బన్ నుంచి తొలిసారి ఆయన అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. దీనితో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గోరఖ్‌పూర్ అర్బన్ ప్రాంతం ఆసక్తిని సంతరించుకుంది. అయితే ఆయన పైన పోటీకి ఓ మహిళా అభ్యర్ధిని బరిలోకి దింపింది సమాజ్‌వాదీ పార్టీ.. బీజేపీతో సాహ వివిధ పార్టీలు మారిన దివంగత నేత ఉపేంద్రదత్‌ శుక్లా భార్య సుభావతి శుక్లాని సీఎం పై పోటీకి దింపారు అఖిలేష్ యాదవ్.. ఈ నియోజకవర్గంలో మార్చి 3న ఎన్నికలు జరగనున్నాయి.

ఎవరీ సుభావతి శుక్లా.. ?

ఉపేంద్ర దత్‌ శుక్లా 40 ఏళ్ళు పాటు రాజకీయాల్లో ఉన్నారు. గోరఖ్‌పూర్‌లో క్షేత్రస్థాయిలో బీజేపీ బలోపేతానికి ఆయన ఎంతో కృషి చేశారు. పార్టీలో ఆయనకి మంచి పేరు ఉండేది.. కానీ కాలం కలిసిరాక పోటీ చేసిన నాలుగు ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.. రెండు అసెంబ్లీ ఎన్నికలు, ఒక అసెంబ్లీ ఉప ఎన్నిక, ఒక లోక్‌సభ ఉపఎన్నికల్లో కూడా గెలవలేకపోయారు. బీజేపేలో ఉన్నప్పుడు ఆయనకీ సీఎం యోగికి మధ్య విభేదాలు ఉండేవని, ఆయనతో పోటీ వలన ఉపేంద్ర శుక్లా ఎన్నికల్లో బాగా నష్టపోయారని అంటుంటారు స్థానిక నేతలు. ఉపేంద్ర దత్‌ శుక్లా మరణం తర్వాత ఆయన భార్య సుభావతి తన కుమారుడు అమిత్‌ దత్‌ శుక్లాకు గోరఖ్‌పూర్‌లోనే మరో నియోజకవర్గం నుంచి టికెట్‌ ఆశించారు కానీ వారి ప్రతిపాదనని బీజేపీ నిరాకరించడంతో తన కుమారుడితో కలిసి ఎస్పీలో చేరారు సుభావతి శుక్లా.

సీఎం పై పోటీ ఎందుకు?

ఉపేంద్ర దత్‌ శుక్లా రాజకీయాల్లో ఉన్నతకాలం సుభావతి శుక్లా ఇల్లు విడిచి బయటకు రాలేదు.. ఒక సాధారణ గృహిణి గానే జీవితాన్ని గడిపారు. రాజకీయ పరంగా ఎలాంటి అనుభవం లేని సుభావతిని, సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వంటి అభ్యర్థిపై పోటీకి దింపింది ఎస్పీ.. అయితే దీనివెనుక కొన్ని రాజకీయ లెక్కలున్నాయి. ఠాకూర్‌ సామాజికవర్గానికి చెందిన యోగిపై యూపీలో బ్రాహ్మణులు కాస్త ఆగ్రహంగానే ఉన్నారు. గోరఖ్‌పూర్‌లో బ్రాహ్మణ సామాజిక వర్గంలో ప్రముఖ నాయకుడు దత్‌ శుక్లా,, ఆయన మరణించినప్పుడు కూడా యోగి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించకపోవడంపై అప్పట్లో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో సానుభూతి ఓట్లు, ఓబీసీల అండతో పాటుగా బ్రాహ్మణ ఓట్లను కూడా దక్కించుకోవాలన్న వ్యూహంతో అఖిలేష్ ఆమెను బరిలోకి దింపారన్న రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story