Gujarath: 202 రోజులు కరోనాతో పోరాడి క్షేమంగా ఇంటికి..

Gujarath: 202 రోజులు కరోనాతో పోరాడి క్షేమంగా ఇంటికి..
Gujarath: కానీ మందులు, ఆక్సిజన్ థెరపీ ద్వారానే కోలుకోవడం జరిగిందని తెలిపారు.

Gujarath: వచ్చిన జబ్బు కంటే భయమే మనిషిని కొంత కృంగదీస్తుంది. చేసే ప్రయత్నం చేస్తూ ధైర్యంగా ఉంటే ఎంత పెద్ద రోగం నుంచి అయినా బయటపడొచ్చని నిరూపించింది గుజరాత్‌కు చెందిన ఓ 45 ఏళ్ల మహిళ. దాహోద్‌లో రైల్వే ఉద్యోగి అయిన గీతా ధార్మిక్, మహమ్మారి రెండవ వేవ్ సమయంలో కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. దాహోద్ రైల్వే ఆసుపత్రి ఆమె మొత్తం 202 రోజులు ఉండవలసి వచ్చింది.

రైల్వే ఇంజనీర్‌గా పని చేస్తున్న భర్త త్రిలోక్ ధార్మిక్ ఒకానొక దశలో తాను చాలా కంగారు పడ్డానని కానీ చివరకు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చిందని తెలిపారు. చికిత్స పొందుతున్న సమయంలో వైద్యులు ఆమెకు ఊపిరితిత్తుల మార్పిడి అవసరమని కూడా చెప్పారు. కానీ మందులు, ఆక్సిజన్ థెరపీ ద్వారానే కోలుకోవడం జరిగిందని తెలిపారు. ఆరోగ్యం నెమ్మదిగా మెరుగుపడటంతో వైద్యులు ఆమెను డిశ్చార్జ్ చేయాలని నిర్ణయించుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story