Maharashtra : చిరుతపులితో పోరాడి కూతుర్ని రక్షించుకుంది..!

Maharashtra : చిరుతపులితో పోరాడి కూతుర్ని రక్షించుకుంది..!
Maharashtra : మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో ఓ మహిళ తన మూడేళ్ల కుమార్తెను కాపాడేందుకు ఏకంగా చిరుతపులితో పోరాడింది.

Maharashtra : మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో ఓ మహిళ తన మూడేళ్ల కుమార్తెను కాపాడేందుకు ఏకంగా చిరుతపులితో పోరాడింది. చంద్రాపూర్‌లోని దుర్గాపూర్ కాంప్లెక్స్‌లో ఓ మూడేళ్ల చిన్నారి ఇంటి ఆవరణలో కూర్చుని భోజనం చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చిరుతపులి అకస్మాత్తుగా దాడి చేసి ఈ చిన్నారిని ఈడ్చుకెళ్లింది. అయితే ఇది చూసిన ఆ చిన్నారి తల్లి చిరుతపులిని కర్రతో వెంబడించి పలుమార్లు చిరుత నోటిపై కొట్టింది. దీంతో చిరుత ఆ చిన్నారిని అక్కడనే వదిలేసి పారిపోయింది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యం బాగానే ఉంది. ఈ ఘటన పైన ఆ చిన్నారి తల్లి జ్యోతి పుపల్వార్ మాట్లాడుతూ.. "నేను స్నానం చేయడానికి వెళ్లిన సమయంలో నా కూతురు భోజనం చేస్తోంది. నేను బయటకు వచ్చేసరికి చిరుతపులి ఆమెపై దాడి చేసి తీసుకెళ్లడం చూశాను. వెంటనే నేను ఓ కర్ర సహాయంతో చిరుతపులి పై పదేపదే దాడి చేయడంతో అది నా కూతుర్ని అక్కడే వదిలేసి పారిపోయింది" అని చెప్పుకొచ్చింది. అయితే ఆ ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు కొత్తేమి కాదు.

గత నెలలోనే చిరుతపులి దాడి చేయడంతో ఇద్దరు వృద్ధులు, ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తంమీద, ఈ కాంప్లెక్స్‌లో వన్యప్రాణుల దాడి కారణంగా 6 మంది చిన్నారులతో సహా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ చిన్నారి ఇలా దాడికి పాల్పడడం 16వ సంఘటన.. తరుచుగా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటూ ఉండడంతో అక్కడి నివాసులు అటవీ శాఖ అధికారుల పైన ఫైర్ అవుతున్నారు. ఆ చిరుతపులిని చంపాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story