China: 27 వేలకుపైగా కరోనా కేసులు.. అందులో 914 మందికి మాత్రమే లక్షణాలు..

China: 27 వేలకుపైగా కరోనా కేసులు.. అందులో 914 మందికి మాత్రమే లక్షణాలు..
China:ఆదివారం ఒక్కరోజే షాంఘైలో 27 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా అందులో 914 మందికి అసలు లక్షణాలే లేవని నిర్ధారించారు

China: కోవిడ్ అనేది అందరి జీవితాలను ఒక్కసారిగా కుదిపేసింది. ప్రపంచంలోనే చాలావరకు దేశాలు ఈ కోవిడ్ వల్ల ఎఫెక్ట్ అయ్యాయి. అయితే కోవిడ్ అనేది చైనా నుండే బయటికి వచ్చిందని ఇప్పటికే నిర్దారణ అయ్యింది. అందుకేనేమో ఇంకా ఆ దేశం కోవిడ్ ఫ్రీ అవ్వలేదు. చైనాలోని ప్రధాన నగరాలను కరోనా వణికిస్తోంది. తాజాగా షాంఘైతో పాటు మరో ప్రధాన నగరంలో కూడా కోవిడ్ ఆంక్షలను అమలు చేసింది అక్కడి ప్రభుత్వం.

ఆదివారం ఒక్కరోజే షాంఘైలో 27 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా అందులో 914 మందికి అసలు లక్షణాలే లేవని నిర్ధారించారు వైద్యులు. అందుకే అక్కడ ఆంక్షలు మరింత కఠినంగా మార్చారు. షాంఘైతో పాటు గ్వాంగ్జౌలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. అందరూ ఇళ్లకే పరిమితం అవ్వడంతో నిత్యావసరాల సరుకులు లేక ఆకలితో అలమటిస్తున్నారు అక్కడి ప్రజలు.

షాంఘైలో కనీస ఆహారం లేక ప్రజలు అలమటిస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అపార్ట్‌మెంట్‌ల నుండి కనీసం బయటికి రావడం కూడా వీలు కాకపోవడంతో వారంతా కిటికీల దగ్గర ఉండే కేకలు పెడుతున్నారు. కొన్నాళ్లు ఇలాగే కొనసాగితే ఆకలి చావులతో పాటు ఆత్మహత్యలు కూడా తప్పవని కొందరు అనుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story