EgyptAir Plane Crash: ఒక్క సిగరెట్.. విమానంలోని 66 మంది ప్రాణాలు తీసింది..

EgyptAir Plane Crash: ఒక్క సిగరెట్.. విమానంలోని 66 మంది ప్రాణాలు తీసింది..
EgyptAir Plane Crash: ఆరోజు విమాన ప్రమాదం ఎలా జరిగింది అనే అంశంపై ఫ్రెంచ్‌ ఏవియేషన్ నిపుణులు దర్యాప్తు చేపట్టారు.

Egypt Air Plane Crash: ఆరేళ్ల క్రితం.. అంటే 2016 మే నెలలో ఈజిప్ట్ ఎయిర్‌ సంస్థకు చెందిన ఎయిర్‌బస్‌ ఏ320 విమానం ఒకటి ప్రమాదానికి గురయ్యింది. పారిస్ నుండి కైరోకు బయలుదేరిన ఈ విమానం గ్రీక్‌ ద్వీపాలకు సమీపంలోకి రాగానే దానికి రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఇక కాసేపటికే అది కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో ఈ విమానంలో 66 మంది ప్రయాణికులు ఉన్నారు. తాజాగా ఈ ప్లెయిర్ క్రాష్‌కు కారణం ఒక సిగరెట్ అన్న విషయం సంచలనంగా మారింది.

ఆరోజు విమాన ప్రమాదం ఎలా జరిగింది అనే అంశంపై ఫ్రెంచ్‌ ఏవియేషన్ నిపుణులు దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించిన వివరాలతో కొన్ని రోజుల క్రితం పారిస్‌లోని అప్పీల్‌ కోర్టులో నివేదికను కూడా సమర్పించారు. దీంతో ఈ ప్రమాద సమయంలో జరిగిన ఓ షాకింగ్ విషయం బయటపడింది. ఇదంతా పైలెట్ సిగరెట్ వెలిగించడానికి ప్రయత్నించినందుకే జరిగినట్టు తెలిసింది.

ప్రమాదానికి ముందు కాక్‌పిట్‌లో ఉన్న పైలెట్ సిగరెట్ వెలిగించడానికి ప్రయత్నించాడు. దీంతో ముందుగా అత్యవసర మాస్క్ నుండి ఆక్సిజన్‌ లీక్‌ అయ్యి కాక్‌పిట్‌లో మంటలు చెలరేగాయి. దీని ఫలితంగానే విమానం కుప్పకూలిపోయింది. ఆ సమయంలో కాక్‌పిట్‌లో ఉన్న సిబ్బంది అరుపులు మాస్క్‌కు ఉన్న మైక్రోఫోన్‌లో రికార్డ్ అయనట్టు నివేదికలో ఉంది.

Tags

Read MoreRead Less
Next Story