Miss America: అందాల పోటీల్లో కొరియన్ అమెరికన్ భామ రికార్డ్.. వందేళ్ల చరిత్రలో..

Emma Broyles (tv5news.in)

Emma Broyles (tv5news.in)

Miss America: కొరియన్ అమెరికన్ అమ్మాయి కష్టపడి వందేళ్ల మిస్ అమెరికా పోటీల చరిత్రలో కొత్త అధ్యాయనాన్ని ప్రారంభించింది.

Miss America: అందాల పోటీలు అనేవి చూసేవారికి మామూలుగానే అనిపించినా.. అందులో పోటీ చేసే వారికి మాత్రం అవి తమ జీవితంలో చాలా కీలకం. ముఖ్యం ఏదైనా దేశానికి మిస్ బ్యూటీగా సెలక్ట్ అవ్వాలంటే దాని వెనుక చాలానే కృషి ఉంటుంది. ఆ అందాల పోటీల్లో వారి తలపై పెట్టే కిరీటం కోసం ఒక్కొక్క అమ్మాయి ఎంతో కష్టపడుతుంది. అలా ఓ కొరియన్ అమెరికన్ అమ్మాయి ఎంతో కష్టపడి వందేళ్ల మిస్ అమెరికా పోటీల చరిత్రలో కొత్త అధ్యాయనాన్ని ప్రారంభించింది.



1921లో అమెరికాలో మిస్ అమెరికా పోటీలు మొదలయ్యాయి. అయితే పలు కారణాల వల్ల కొన్నిసార్లు ఈ పోటీలు జరగలేదు. అయితే ఈ ఏడాది 94వ మిస్ అమెరికా పోటీలు జరిగాయి. ఇందులో అలాస్కాకు చెందిన ఎమ్మి బ్రాయిల్స్ విజయం సాధించి మిస్ అమెరికా కిరీటాన్ని అందుకుంది. మిస్ అమెరికా పోటీలు మొదలయిన దగ్గర నుండి క్రౌన్‌ను ఒక అలాస్కా అమ్మాయి దక్కించుకోవడం ఇదే మొదటిసారి.


ఎమ్మా బ్రాయిల్స్ ప్రస్తుతం ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీలో డెర్మటాలజీ చదువుతోంది. ఎమ్మా వాళ్ల అమ్మ కొరియన్ అయినా కూడా తాను మాత్రం అలాస్కాలోని పుట్టి పెరిగిందని తెలిపింది. ఎమ్మా వాళ్ల అమ్మ ఒక స్కూల్ టీచర్. అందుకే ఎమ్మాకు చదువుతో పాటు ఆటలపై కూడా ఆసక్తి ఉండేది. ఎమ్మా సోదరుడు బ్రెండన్ స్పెషల్ ఒలింపిక్స్ అలాస్కాలో పాల్గొన్నాడు కూడా.


ఎమ్మాకు ఏడీహెచ్‌డీ అనే డిసార్డర్ ఉందని తాను స్పష్టం చేసింది. తానేమి పర్ఫెక్ట్ కాదని, తనలో కూడా లోపాలు ఉన్నాయని, అలా ఉన్నాయి కాబట్టే తాను ఇంకా బెటర్ అవ్వడానికి అవకాశం ఉందని ఎమ్మా చెప్పుకొచ్చింది. కోవిడ్ సమయంలో చాలాకాలం పాటు తన కాలేజీ హాస్టల్‌లో ఐసోలేషన్‌లో ఉన్న ఎమ్మా అప్పుడే తన జీవితంలో ఏదో ఒకటి సాధించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపింది.


తనను చూసి కొంతమంది అయినా ఇన్‌స్పైర్ అయితే.. చాలు అని ఎమ్మా చెప్పింది. గతేడాది తాను ఎలాంటి పరిస్థితిలో ఉందో తలుచుకుంటే.. ఈ సంవత్సరం తాను సాధించిన విజయం తనకు చాలా గర్వంగా ఉందని ఎమ్మా తెలిపింది. ఎమ్మా స్టూడెంట్ మాత్రమే కాకుండా రెండు చిన్న చిన్న ఉద్యోగాలు కూడా చేస్తోంది. అంతే కాకుండా ఇప్పుడు మిస్ అమెరికా కూడా గెలిచింది.

Tags

Read MoreRead Less
Next Story