Tornado: అమెరికాలో టోర్నడో బీభత్సం.. సుమారు 50 మందికి పైగా మృతి..

Tornado (tv5news.in)

Tornado (tv5news.in)

Tornado: అమెరికాలో టోర్నడో తీవ్ర విషాదం నింపింది. ఈశాన్య రాష్ట్రం కెంటనీలో టోర్నడో బీభత్సం సృష్టించింది.

Tornado: అమెరికాలో టోర్నడో తీవ్ర విషాదం నింపింది. ఈశాన్య రాష్ట్రం కెంటనీలో టోర్నడో బీభత్సం సృష్టించింది. టోర్నడో ధాటికి సుమారు 50 మంది మృత్యువాతపడినట్లు ఆ రాష్ట్ర గవర్నర్ ఆండీ బెషీర్ తెలిపారు. కెంటనీ రాష్ట్రానికి సుమారు 200 మైళ్ల మేర పలు జిల్లాలను టోర్నడో బలంగా చుట్టేసినట్లు స్థానికులు తెలిపారు. కెంటనీ చరిత్రలోనే అత్యంత తీవ్రమైన టోర్నడోగా పేర్కొన్నారు ఆ రాష్ట్ర గవర్నర్.

బలమైన గాలులతో పెను బీభత్సం సృష్టించిన టోర్నడో దాటికి మృత్యులు 70 నుంచి 100 వరకు చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలిపారు. టోర్నడో ధాటికి ఓ క్యాండిల్ ఫ్యాక్టరీ పైకప్పు కుప్పకూలటంతో.. భారీగా ప్రాణనష్టం జరిగినట్లు తెలిపారు. పెనుగాలులతో కెంటనీ రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ప్రకటించారు.

సహాయ చర్యల కోసం ఇప్పటికే 180 మంది సిబ్బంది రంగంలోకి దిగారు. స్థానిక పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు సహాయక చర్యల్లో పాల్గొనాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. పలు జిల్లాల్లో శిథిలాల తొలగింపు కొనసాగుతోంది. కెంటనీ రాష్ట్రానికి తగిన సాయం అందించాలని అధికారులు ఫెడరల్ ప్రభుత్వాన్ని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story