Mothers Love: అమ్మప్రేమ.. అంగవైకల్యంతో పుట్టిన తన కొడుకుని వీపున మోస్తూ.. ప్రపంచాన్ని చుట్టేస్తూ..

Mothers Love: అమ్మప్రేమ.. అంగవైకల్యంతో పుట్టిన తన కొడుకుని వీపున మోస్తూ.. ప్రపంచాన్ని చుట్టేస్తూ..
Mothers Love: కనిపెంచిన బిడ్డకు కళ్లు కనపడవని, కాలు కదపలేడని తెలిసి కన్నతల్లి తల్లడిల్లిపోయింది.

Mothers Love: దేవుడు అన్ని చోట్లా తానుండలేక అమ్మని సృష్టించాడంటారు.. అక్షరాలా నిజమేనేమో.. కనిపెంచిన బిడ్డకు కళ్లు కనపడవని, కాలు కదపలేడని తెలిసి కన్నతల్లి తల్లడిల్లిపోయింది. తొమ్మిది నెలలు కడుపులో మోశాను.. ఇప్పుడు జీవితాంతం నా వీపు మీద మోస్తాను అని ఓ మాతృమూర్తి తన కొడుకుని తీసుకుని ట్రావెలర్‌గా ప్రపంచాన్ని చుట్టేస్తోంది. 23 ఏళ్లు ఉన్న అంధుడైన తన కొడుక్కి తన కళ్లతోనే ప్రపంచంలోని అందాలన్నీ చూపిస్తోంది..



ఆస్ట్రేలియాకు చెందిన నిక్కీ ఆంత్ర 17ఏళ్లకే గర్భవతి అయి పిల్లవాడికి జన్మనిచ్చింది. పెరుగుతున్న పిల్లవాడు అంగవైకల్యంతో పుట్టాడని కాళ్లు, కళ్లు పనిచేయవని తెలిసి గుండెలవిసేలా రోదించింది. అంతలోనే తమాయించుకుని ఎలా పెంచితే తనకు, బాబుకు సంతోషంగా ఉంటుందో తెలుసుకుంది.

అప్పటికే టూరిస్టర్‌గా ఓ బ్లాగ్‌ని రన్ చేస్తున్న ఆంత్ర తన పనికి ఏ మాత్రం ఆటంకం లేకుండా చూసుకుంటూ పిల్లాడిని పెంచి పెద్ద చేసింది. 24 గంటలు కొడుకు తనతోనే ఉండేలా అతడిని కూడా తీసుకుని ప్రపంచంలోని పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తోంది. తాను చూసిన ప్రదేశాల విశేషాలన్నీ బ్లాగ్‌లో పంచుకుంటుంది.

కొడుకు జిమ్మీకి ఇప్పుడు 26 ఏళ్లు వచ్చాయి. అయినా అంత్ర తన వీపు మీద మోస్తూనే ఉంది. హవాయి అందాలతో పాటు ప్రపంచంలో మరెన్నో సుందర దృశ్యాలను చూసేందుకు కొడుకుతో పాటు ప్రయాణమవుతుంది.



ఆంత్ర తన కొడుకుకు మంచి జీవితాన్ని ఇస్తానని తనకు తానే వాగ్దానం చేసుకుంది. ఒక తల్లిగా, నిక్కీ తన కొడుకుకు సాధారణ బిడ్డ కోరుకునే ప్రతి ఆనందాన్ని ఇవ్వాలనుకుంది. కరోనా వ్యాప్తి చెందకముందే తన కుమారుడు జిమ్మీ కెనడాను సందర్శించాలని కోరుకుంటున్నట్లు నిక్కీ చెప్పింది.

ఈ తల్లీ కొడుకుల పర్యాటక ప్రదేశాలను చుట్టిన చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జిమ్మీని తీసుకుని ఎక్కడకు వెళ్ళినా డైపర్లు, బట్టలు, బెడ్ ప్యాడ్‌లు, బెడ్‌షీట్‌లు, దిండ్లు తీసుకెళ్లాల్సి ఉంటుందని నిక్కీ ఆంత్రమ్ తెలిపింది. జిమ్మీకి 26 ఏళ్లు వచ్చినా తన కొడుకు ఎప్పుడు తనకు చిన్నపిల్లవాడే అని ముద్దుపెట్టి మురిసిపోతుంది ఆ మాతృమూర్తి.

Tags

Read MoreRead Less
Next Story