Pakistan: పాకిస్థాన్‌కు కొత్త ప్రధాని.. అభినందనలు తెలిపిన మోదీ..

Pakistan: పాకిస్థాన్‌కు కొత్త ప్రధాని.. అభినందనలు తెలిపిన మోదీ..
Pakistan:ప్రధానిగా విపక్షాల ఉమ్మడి అభ్యర్థి పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ బాధ్యతలు స్వీకరించారు

Pakistan: పాకిస్థాన్‌లో నెల రోజులుగా సాగుతున్న పొలిటికల్ డ్రామాకు తెరపడింది. అవిశ్వాస తీర్మానంతో ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్‌ఖాన్‌ను విపక్షాలు తొలగించిన నేపథ్యంలో కొత్త ప్రధాని ఎంపికయ్యారు. ప్రధానిగా విపక్షాల ఉమ్మడి అభ్యర్థి పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా భారత ప్రధాని మోదీ.. ఆయనకు ట్విటర్ ద్వారా అభినందనలు తెలిపారు.

పాక్ నేషనల్‌ అసెంబ్లీలో మొత్తం 342 మంది సభ్యులు ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు 172 సభ్యుల మద్ధతు అవసరం. అయితే ఇమ్రాన్‌ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశానికి అనుకూలంగా 174 మంది మద్దతు తెలపడంతో... పాకిస్థాన్ తదుపరి ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ గెలిచారు. షెహబాజ్‌ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు సోదరుడు.

'పాకిస్థాన్‌ ప్రధానిగా ఎన్నికైన మియాన్‌ ముహమ్మద్‌ షెహ్‌బాజ్‌ షరీఫ్‌కు అభినందనలు. భారత్‌ ఎప్పుడూ ఉగ్రవాదం లేని శాంతి, స్థిరత్వాన్ని కోరుకుంటుంది. అందుకే మనం అభివృద్ధి సవాళ్లపై దృష్టిసారించి ప్రజలు సుఖంగా జీవించడం కోసం పాటుపడదాం' అని మోదీ తన ట్విటర్‌లో ట్వీట్ చేశారు. ప్రస్తుతం పాకిస్థాన్ మీడియాలో షెహబాజ్ షరీఫ్‌పై ఫోకస్ పెరగడంతో వార్తలన్నీ ఆయన చుట్టూనే తిరుగుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story