Narendra Modi: యూరప్ పర్యటనలో ఉక్రెయిన్‌, రష్యా యుద్ధంపై స్పందించిన మోదీ..

Narendra Modi: యూరప్ పర్యటనలో ఉక్రెయిన్‌, రష్యా యుద్ధంపై స్పందించిన మోదీ..
Narendra Modi: జర్మనీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే ఐజీసీతో భారత్ జత కలవడాన్ని స్వాగతించారు.

Narendra Modi: ప్రధాని మోదీ మూడు రోజుల యూరప్ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. తొలుత జర్మనీ చేరుకున్న ప్రధాని మోదీకి ఆదేశ అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం బెర్లిన్‌లో జర్మన్ ఛాన్సలర్ ఓలాస్ స్కాల్జ్‌తో భేటీ అయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేలా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య వ్యాపార రంగాలకు ఊతమిచ్చేలా రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు.

జర్మనీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే ఐజీసీతో భారత్ జత కలవడాన్ని స్వాగతించారు. ఇరుదేశాల మధ్య దీర్ఘకాలిక ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడానికి ఐజీసీ ఉపకరిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. తన ప్రసంగంలో ఉక్రెయిన్‌ రష్యా యుద్ధం గురించి ప్రస్తావించారు మోదీ. ఉక్రెయిన్‌-రష్యా మధ్య జరుగుతోన్న యుద్ధంలో ప్రతిఒక్కరు నష్టపోవడం తప్పితే ఎవ్వరూ విజయం సాధించలేరన్నారు.

ఈ సంక్షోభ ముగింపుకు చర్చలు ఒక్కటే పరిష్కార మార్గమన్న మోదీ.. భారత్‌ శాంతిని మాత్రమే కోరుకుంటోందని ఉద్ఘాటించారు. యుద్ధాన్ని ముగించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు జర్మనీలో ప్రధాని మోదీకి ప్రవాస భారతీయులు ఆత్మీయ స్వాగతం పలికారు. కొందరు చిన్నారులు ఆకట్టుకునే బహుమతులు ఇచ్చారు. ఓ చిన్నారి తాను గీసిన చిత్రాన్ని ప్రధానికి బహూకరించింది. అక్కడే ఉన్న మరో బాలుడు దేశభక్తి గీతం ఆలపించాడు.

బాలుడి పాట వింటున్నంత సేపు మోదీ చిటికెలు వేస్తూ అతడిని ఉత్సాహపరిచారు. అనంతరం అక్కడి విద్యార్థులతో ముచ్చటించారు. ఇవాళ డెన్మార్క్‌ చేరుకోనున్న మోదీ.. రెండో భారత్‌-నార్డిక్‌ సదస్సులో డెన్మార్క్‌, ఐస్‌లాండ్‌, ఫిన్లాండ్‌, స్వీడన్‌, నార్వే దేశాధినేతలతో భేటీ అవుతారు. డెన్మార్క్‌ నుంచి భారత్‌ తిరిగి వస్తూ పారిస్‌లో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ని ప్రధాని మోదీ కలవనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story