Philippines: ఆ దేశంలో తుపాన్‌ ధాటికి 100 మందికిపైగా మృతి..

Philippines (tv5news.in)

Philippines (tv5news.in)

Philippines: ఫిలిప్పీన్స్‌లో బీభత్సం సృష్టించిన రాయ్ తుపాన్.. ఆ దేశాన్ని పూర్తిగా అంధకారంలోకి నెట్టేసింది.

Philippines: ఫిలిప్పీన్స్‌లో బీభత్సం సృష్టించిన రాయ్ తుపాన్.. ఆ దేశాన్ని పూర్తిగా అంధకారంలోకి నెట్టేసింది. రెండే రోజుల్లో యావత్​ దేశాన్ని అల్లకల్లోలం చేసింది. దీంతో ఫిలిప్పీన్స్‌ కోలుకోలేని స్థితికి చేరింది. ఎటూ చూసిన శిథిలమైన ఇళ్లు, నేలకొరిగిన వృక్షాలే కనిపిస్తున్నాయి.

విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమాచార, రవాణా వ్యవస్థలు స్తంభించిపోయాయి. తుపాను ధాటికి మృతి చెందిన వారి సంఖ్య 100 దాటింది. పలువురి ఆచూకీ గల్లంతయినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ఒక్క బోహోల్​ ప్రావిన్స్​లోనే 63 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గవర్నర్​ ఆర్థుర్​యాప్.. ​ఫేస్​బుక్‌లో పోస్ట్​ చేశారు. ఫిలిప్పీన్స్​ప్రెసిడెంట్​రొడ్రిగో డుటెర్టే... దెబ్బతిన్న పలు ప్రాంతాలను సందర్శించారు. 2 బిలియన్​ పెసోస్​సాయం ప్రకటించారు. తుపాను కారణంగా 7లక్షల 80 వేల మంది ప్రభావితమైనట్లు ఫిలిప్పీన్స్​ప్రభుత్వం వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story