Ukraine: మరియుపూల్‌ తర్వాత లుహాన్స్క్‌ ప్రాంతంపై రష్యా దృష్టి..

Ukraine: మరియుపూల్‌ తర్వాత లుహాన్స్క్‌ ప్రాంతంపై రష్యా దృష్టి..
Ukraine: మరియుపూల్‌ హస్తగతం చేసుకున్న పుతిన్‌ సేనలు.. ఇప్పుడు దృష్టి లుహాన్స్క్‌ ప్రాంతంపైకి మళ్లించాయి.

Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతునే ఉన్నాయి. మరియుపూల్‌ హస్తగతం చేసుకున్న పుతిన్‌ సేనలు.. ఇప్పుడు దృష్టి లుహాన్స్క్‌ ప్రాంతంపైకి మళ్లించాయి. డాన్‌బాస్‌ ప్రాంతాన్ని ఉక్రెయిన్‌ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని భావిస్తోంది. వరుస క్షిపణి దాడులు చేస్తోంది. డాన్‌బాస్‌ ప్రాంతంలో పరిస్థితి అత్యంత కఠినంగా ఉందని.. స్లోవియాన్స్క్‌, సివోరా డొనెట్స్క్‌ పై రష్యా సేనలు అత్యంత తీవ్రమైన దాడులు చేస్తున్నాయని ఆరోపించారు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.

మరోవైపు యుద్ధంలో కీలక సమయంలో రష్యాకు ఎలాంటి అవకాశం ఇచ్చినా అది రెట్టింపు శక్తితో దాడి చేస్తుందంటున్నారు ఉక్రెయిన్‌ అధికారులు. యుద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ సైనిక చర్యకు దౌత్యంతోనే ముగింపు పలకవచ్చని అభిప్రాయపడుతున్నారు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.

రష్యాతో జరుగుతున్న ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌ సైనికులతోపాటు దేశ ప్రజలు వీరోచిత పోరాటం చేస్తున్నారని కొనియాడారు. ఆ పోరాటంతోనే మాస్కో ఆక్రమించిన ఎన్నో ప్రాంతాలను ఉక్రెయిన్‌ తిరిగి సొంతం చేసుకుందని వివరించారు. నేషనల్‌ టీవీలో జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. ఇరుపక్షాలు కూర్చొని మాట్లాడుకుంటేనే ఈ సంక్లిష్ట పరిస్థితికి పరిష్కారం దొరుకుతుందన్నారు. మాస్కోతో కాల్పుల విరమణ లేదా ఇతర ఒప్పందాలు జరిగే అవకాశాలను ఉక్రెయిన్‌ తోసిపుచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story