Tornado: కెంటకీ చరిత్రలోనే అత్యంత తీవ్రమైన టోర్నడో.. 70 మందికి పైగా మృత్యువాత..

Tornado: కెంటకీ చరిత్రలోనే అత్యంత తీవ్రమైన టోర్నడో.. 70 మందికి పైగా మృత్యువాత..
Tornado: అగ్రరాజ్యం అమెరికాను టోర్నడో వణికిస్తోంది.ఈశాన్య రాష్ట్రం కెంటకీతో పాటు ఆరు రాష్ట్రాలపై టోర్నడో ప్రభావం చూపింది

Tornado: అగ్రరాజ్యం అమెరికాను టోర్నడో వణికిస్తోంది. ఈశాన్య రాష్ట్రం కెంటకీతో పాటు ఆరు రాష్ట్రాలపై టోర్నడో ప్రభావం చూపింది. కెంటకీపై భీభత్సం సృష్టించింది. 200 మైళ్ల వేగంతో వీస్తున్న బలమైన గాలులు కౌంటకీ రాష్ట్రంలోని పలు కౌంటీలను చుట్టేశాయి. కెంటకీ చరిత్రలోనే ఇది అత్యంత తీవ్రమైన టోర్నడోగా రికార్డయింది. పెనుగాలులతో కూడిన తుపాను ధాటికి వేర్వేరు ఘటనల్లో 70 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆ రాష్ట్ర గవర్నర్‌ వెల్లడించారు.

టోర్నడో ధాటికి కెంటకీలోని బౌలింగ్‌ గ్రీన్‌ ప్రాంతంలో అనేక అపార్ట్‌మెంట్లు భారీగా దెబ్బతిన్నాయి. కొన్ని కర్మాగారాలు కుప్పకూలాయి. రహదారులపై శిథిలాలు పడడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. సహాయక చర్యలుకొనసాగుతున్నాయి. టోర్నడో ప్రభావం అమెరికాలోని ఆరు రాష్ట్రాలపై పడింది. ఇల్లినోయీలో అమెజాన్‌ గిడ్డంగి పైకప్పు ఎగిరిపోయి, భారీ గోడ కూప్పకూలింది.

అలాస్కాలో ఓ నర్సింగ్‌హోం దెబ్బతింది. పలు ప్రాంతాల్లో భవనాలు కూలాయి. మిస్సౌరి, మిసిసిపి, ఆర్కాన్సాస్‌, టెన్నెసీలపైనా టోర్నడో విరుచుకుపడింది. విద్యుత్తు సరఫరా స్తంభించిపోయి దాదాపు 3 లక్షలమంది అంధకారంలో చిక్కుకుపోయారు. అత్యవసరమైతే తప్పిస్తే బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. దేశాధ్యక్షుడు జో బైడెన్‌ తాజా పరిస్థితిని సమీక్షించారు.

Tags

Read MoreRead Less
Next Story