Xi Jinping: ప్రమాదకరమైన మెదడు వ్యాధితో బాధపడుతున్న చైనా అధ్యక్షుడు..

Xi Jinping: ప్రమాదకరమైన మెదడు వ్యాధితో బాధపడుతున్న చైనా అధ్యక్షుడు..
Xi Jinping: 2019 నుండి జిన్‌పింగ్ సెరిబ్రల్ అనూరిజం అనే వ్యాధితో బాధపడుతున్నారట.

Xi Jinping: చైనా ప్రస్తుతం తాను తొవ్వుకున్న గోతిలో తానే పడినట్టు అన్న పరిస్థితిలో ఉంది. కోవిడ్ అనేది చైనా నుండి ప్రపంచానికి సోకిందని ఇప్పటికీ ఎన్నో అధ్యాయనాలు పేర్కొన్నాయి. అయితే ఆ దేశం నుండి బయటికి వచ్చిన కరోనా ఇప్పుడు ఆ దేశాన్నే ముంచే స్థాయికి చేరింది. పరిస్థితి చేయిదాటిపోతున్నా కూడా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. ఈ విషయంపై పెద్దగా స్పందించకపోవడం వెనుక బలమైన కారణమే ఉందని అక్కడి మీడియా అంటోంది.

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. ఇటలీ, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటిస్తున్నప్పుడు ఆయన ఏదో విషయంలో ఇబ్బంది పడుతున్నట్టుగా స్పష్టంగా అర్థమయ్యింది. అంతే కాకుండా 2020లో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు జిన్‌పింగ్‌కు ఆగకుండా దగ్గు రావడం కూడా ప్రజల్లో ఆందోళన కలిగించింది. అయితే దీనిపై మీడియా కొంత సమాచారం సేకరించింది.

2019 నుండి జిన్‌పింగ్ సెరిబ్రల్ అనూరిజం అనే వ్యాధితో బాధపడుతున్నారట. ఈ వ్యాధి వల్ల మెదడులోని రక్తనాళాల గోడ లోపలి కండరాల పొర బలహీనపడుతుందని వైద్యులు తెలిపారని చైనా మీడియా అంటోంది. అంతే కాకుండా దీని వల్ల మెదడులోని రక్తానాళాలు ఎప్పుడు పగిలిపోతాయో చెప్పలేమని, అంతే కాకుండా మెదడు చుట్టూ రక్తస్రావం కూడా అవుతోందని వారు చెప్పినట్టు తెలుస్తోంది.

సెరిబ్రల్ అనూరిజం వల్ల ఏర్పడే రక్తస్రావం వల్ల వ్యక్తికి గుండేపోటు రావడం లేదా కోమాలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయట. ప్రస్తుతం ఈ వ్యాధికి జిన్‌పింగ్ చికిత్స పొందుతున్నట్టు సమాచారం. అందుకే తను కొంతకాలంగా ఏ విషయం గురించి అయినా మాట్లాడడానికి నాయకులను కలవడం లేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా మరోవైపు చైనాలో కరోనా విజృంభణ ప్రజలను వణికిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story