భాగస్వామి నిజాయితీపై ఆరాతీసే డీఎన్ఏ టెస్ట్ లు

మీ పార్టనర్ మిమ్మల్ని మోసం చేస్తుందా..?
మీ లవర్ ఛీట్ చేస్తుందా...?
ఈ విషయాన్ని నిగ్గు తేల్చడానికి ఆన్‌లైన్ డిఎన్‌ఏ టెస్ట్ అందుబాటులోకి రాబోతోంది. ఆస్ర్టేలియాలో బాలారిష్టాలను ఎదుర్కొంటున్న ఈ టెస్ట్, ఎదుటి వారి నిజాయితీని తేల్చిపారేస్తుందంటున్నారు అక్కడి సైంటిస్తులు. భర్తపై నమ్మకంలేని వాళ్లు డిటెక్టివ్ ఏజెన్సీలను ఆశ్రయించే భార్యలను చూశాం.. అలాగే భార్యపై విశ్వాసంలేని భర్తలు డిటెక్టివ్‌లను నమ్ముకోవడం అనేక సందర్భాల్లో గమనించాం. తాజాగా పార్టనర్ నిజాయితీని తెలుసుకోవడానికి ఆన్‌లైన్ డిఎన్‌ఏ పరీక్షను పరిచయం చేస్తున్నారు మెల్‌బోర్న్ సైంటిస్టులు.
మెల్‌బోర్న్లోని ఈజీ డిఎన్‌ఏ.కామ్.ఎయు కంపెనీ డిఎన్‌ఏ పరీక్షలను ఆన్‌లైన్ ద్వారా నిర్వహించే ఏర్పాట్లను చేసింది. చూయింగ్ గమ్, కర్చీఫ్స్, షేవింగ్ కిట్, టూత్ బ్రష్, కాళ్ల వేళ్లు, టోపీలు, చేతి కడియాలు తదితరాలపై పడిన ముద్రల్లోని కణాల ఆధారంగా డివైఎం అనే పరీక్షను చేయడానికి వీలుందని కంపెనీ వివరించింది. కంప్యూటర్ యూజర్స్ ఖచ్చితమైన సమాచారం ఇవ్వకపోతే...ఫలితాల్లో తేడా వచ్చే ప్రమాదం ఉంది. సంక్లిష్టంగా ఉండే జన్యుపరీక్షలను ఆన్‌లైన్ ద్వారా చేయడం అంత ఈజీ ఏమీ కాదు.
అందుకే, పరీక్షల్లోని నాణ్యత, పరీక్షా విధానం గురించి తెలియకుండా ఆన్‌లైన్ డిఎన్‌ఏ టెస్ట్‌లను కొనుగోలు చేయొద్దని ఆస్ట్రేలియన్ మెడికల్ అసోషియేషన్ అధ్యక్షులు డాక్టర్ హార్రీహామ్లీ యూజర్స్‌కు సలహా ఇచ్చారు. ఇప్పటి వరకు అమెరికా ఆథారిటీస్ మాత్రమే వాళ్ల లాబ్స్‌లో ఈజీ డిఎన్‌ఏ టెస్టులకు గుర్తింపు నిచ్చారు. కానీ, నాటా గుర్తింపు ఇంకా ఈజీ డిఎన్‌ఏ పరీక్షలకు లభించలేదు. ఈ పరీక్షలకు సంబంధించి ఖచ్చితమైన పరిశీలన జరగలేదని నాటా అభిప్రాయపడింది. పూర్తి వివరాలు కూడా నాటాకు అందలేదు.
ఇలాంటి పరీక్షల వలన తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయని భావిస్తోంది. చాలా సున్నితమైన డిఎన్‌ఏ పరీక్షల ఫలితాలను ఈజీగా తారుమారు చేయడానికి అవకాశం ఉందని మెల్‌బోర్న్లోని హెల్త్ సర్వీస్ కమిషన్ అభిప్రాయపడుతోంది. ఇలా వివాదస్పదమైన ఆన్‌లైన్ డిఎన్‌ఏ పరీక్ష మనకు అందుబాటులోకి రావడానికి కొంత కాలం పట్టే అవకాశం ఉంది. అందుబాటులోకి వస్తే..మాత్రం భాగస్వామిపై అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. ప్రేమ ఒలకబోతలోని నిజాయితీని నిగ్గు తేల్చాలా డిజైన్ చేసిన ఈజీ డిఎన్‌ఏ టెస్ట్‌పై అప్పుడే అందరి చూపు పడింది.
watch video....
Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


