పెషావర్ లో తెగబడ్డ ముష్కరులు

పాక్ ప్రధాన నగరం పెషావర్‌లోని యూఎస్ కాన్సొలేట్‌పై ముష్కరులు తెగబడ్డారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతను సైతం ఛేదించుకుని వెళ్లిన మిలిటెంట్లు భద్రతాబలగాలను ఢీకొన్నారు. ఇరు పక్షాల మధ్య భీకరమైన కాల్పులు జరిగాయి. అయితే.. ఈ ఘటనపై ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. నింగినుంచి హెలికాప్టర్ల ద్వారా కాన్సొలేట్‌పై నిఘాను పెంచారు. అదనపు పోలీసు బలగాలను పంపి.. ఘటనాస్థలానికి దారితీసే అన్ని దారులనూ మూసివేశారు. పెషావర్‌లోని యూఎస్ కాన్సొలేట్‌పై దాడి జరగడం ఇది రెండోసారి.
గతంలో ఏప్రిల్ ఐదున ఆటమిక్ వెపన్స్‌తో దాడి చేసిన మిలిటెంట్లు.. ముగ్గురి ప్రాణాలు తీసుకున్నారు. ఆరుగురు తీవ్రవాదులు కూడా మృతిచెందారు. తాజా ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి వుంది. ఇప్పటికే.. పాక్ నగరాలన్నీ ముష్కరుల స్థావరాలుగా మారిపోయాయని వైట్‌హౌస్ కోడైకూస్తుండగా, తాజాగా యుఎస్ కాన్సొలేట్‌పైనా దాడి జరగడాన్ని అమెరికా మరింత సీరియస్‌గా తీసుకునే అవకాశముంది.
Published Date : Saturday, Aug 28, 04:15pm IST
Watch Video....
Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


