లండన్లో పేలుళ్లకు ద్వంశమైన హరేకృష్ణ దేవాలయం

శుక్రవారం మధ్య లండన్లోని లైసెస్టర్ ప్రాంతంలో హరే కృష్ణ దేవాలయం వద్ద శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భముగా ప్రవాస హిందుత్వ భక్తులు ఘనంగా వేడుకలు జరుపుకొంటున్న భవనంలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ళ జరిగిన తోరెస్బి వీది లోకి అగ్నిమాపక సిబ్బంది వెంటనే ప్రవేశించటానికి తీవ్రంగా శ్రమించవలిసి వచ్చిందని, పేలుళ్లకు దాదాపు మూడొంతుల భవనము కుప్పకూలినట్లు అక్కడి అగ్నిమాపక సిబ్బంది ఒకరు వెల్లడించారు.
ఐతే ఈ ఘటనలో ఆలయం లోపల ఉన్న భక్తులంతా బద్రంగా వున్నట్లు ఆలయ ప్రెసిడెంట్ స్పష్టం చేశారు. ఆలయం లోపల వంట చేయుటకు ఉపయోగించే గ్యాస్ సిలెండర్ వల్ల పేలుళ్లు సంభవించాయని సమాచారం.
Published Date : Saturday, Sep 4, 01:58Pm IST
Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


