Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
ఇవాళ సంథింగ్ స్పెషల్ డే ?
AA


ఇవాళ అరుదైన రోజు. వంద సంవత్సరాలకు ఒకసారి వచ్చే రోజు అదే అక్టోబర్‌ పది, 2010. ఈ రోజున తమ జీవితంలో మరపురాని రోజుగా మార్చుకొనేందుకు వేలాది జంటలు సిద్ధపడుతున్నాయి. పెళ్ళి బంధంతో ఒక్కటి కాబోతున్నాయి. మరోవైపు చరిత్రకు సాక్ష్యంగా నిలచే ఈ రోజును సెలబ్రేట్‌ చేసుకొనేందుకు ప్రతీఒక్కరు సిద్దమవుతున్నారు. 10వ తేది....10వ నెల...10వ సంవత్సరం...మూడు పదులు...ఒకే రోజు...సచిన్‌ జెర్సీ నెంబర్‌ 10, టాప్‌ సాకర్‌ ప్లేయర్స్‌ జెర్సీ నెంబర్‌ 10 ఈ నెంబర్‌లో ఓ విశేషం దాగి ఉంది...కొత్త ప్రారంభాలకు, స్వేచ్ఛకు, స్వంత భావాలకు ప్రతీక అని న్యూమరాలజిస్టులు పరిశోధకులు అంటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఈ రోజుకు ఉన్న ప్రాముఖ్యం అంతా ఇంతా కాదు. ఈ రోజు కోసం వేల కళ్ళు ఎదురు చూస్తున్నాయి. ఆస్ట్రేలియాలో వందకు పైగా ప్రేమ జంటలు...2010వ సంవత్సరం 10వ నెల 10వ రోజున వివాహం చేసుకోవడానికి రెడీ అయ్యాయి. ఇందుకు గల కారణం ఇలాంటి తేదీ 1000 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే రావడం. దీంతో చాలా మంది జంటలు తమ ప్రేమ ప్రయాణానికి ఫుల్‌స్టాప్ పెట్టి ఒక ఇంటివాళ్లు కావడానికి రెడీ అవుతున్నారు. వెయ్యేళ్ళలో ఒక్కసారి మాత్రమే వచ్చే ఇటువంటి రోజున పెళ్లి చేసుకునే అవకాశాన్ని జంటలు అదృష్టంగా భావిస్తున్నాయి.

ఇది వరకూ ఎన్నడూ లేనంతగా ఆదివారం రోజు వివాహాలు చేసుకునేందుకు ఎంట్రీలు వస్తున్నాయని మ్యారేజ్‌ రిజిస్టర్‌ చేసే అధికారులు చెబుతున్నారు. ఆస్ట్రేలియాలోనే కాదు సంఖ్య శాస్త్రాన్ని విపరీతంగా నమ్మే జర్మన్‌లు...చైనా వారు తమ జీవితంలో ఇది మధురమైన రోజుగా భావిస్తూ పండుగ చేసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక వ్యాపార సంస్థలు పూల బోకేలను సిద్దం చేస్తున్నాయి. బేకరీలు స్పెషల్‌ కేక్‌లు రడీ చేస్తున్నాయి. అంతే కాదు మరిచిపోలేని వండర్‌ను నమోదు చేసుకునేందుకు తహతహలాడుతున్నారు. సో మీరు రెడీ అవుతున్నారా...ఆల్‌ ది బెస్ట్‌.

Published Date : Sunday. Oct 10. 12:55PM IST

Watch Video............
Related Articles
Gallery