Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
భారత్‌కు పొంచి వున్న ముప్పు
AA

* 2012లో ప్రళయం రాదంటున్న చైనీయులు
* భారత్‌లో భూకంపాలు, వరదలు
* కల్లోలం కానున్న దక్షిణాసియా
* సంక్షోభం నుంచి గట్టెక్కనున్న అమెరికా
* 2012 డిసెంబర్‌ 21 \'డూమ్స్‌ డే \'
* బద్దలయ్యే అగ్ని పర్వతాలు
* ఉప్పొంగనున్న సముద్రాలు
* 2012 నీటి ఆధారిత సంవత్సరం
* భూమిపై నీటి ప్రభావం అధికం
* దక్షిణాసియాలో భారీ వరదలు
* భారత్‌కు పొంచి వున్న ముప్పు


2012లో ప్రళయం తప్పదా ? ప్రపంచం అంతం కాబోతోందా ? సుదీర్ఘ కాలంగా జరుగుతున్న ఈ చర్చను కొట్టి పారేస్తున్నారు చైనా పంచాంగ కర్తలు. సోమవారం నూతన సంవత్సరాదిని జరుపుకున్న చైనాలో జ్యోతిష్యులు ఈ ఏడాది ప్రపంచ గమనాన్ని అంచనా వేశారు. భారత్‌తో పాటు దక్షిణాసియాలోని పలు దేశాలు ఈ సంవత్సరం భూకంపాలు, వరదలతో కల్లోలమవుతాయని చెబుతున్నారు చైనా జ్యోతిష్యులు.

డూమ్స్‌ డే గా చర్చల్లో నానుతున్న 2012 డిసెంబర్ 21న ప్రళయం సంభవించి, ప్రపంచం అంతమైపోతుందన్న వాదనలు బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. భూగోళంలో ఒక పక్క అగ్ని పర్వతాలు బద్దలవడం, మరోపక్క సముద్రాలు ఉప్పొంగి ఎవరెస్ట్‌ శిఖరంతో సహా అంతా మునిగిపోవడం జరుగుతాయన్న ఊహాగానాలున్నాయి. వీటి ఆధారంగా ఏకంగా సినిమాలే తెరకెక్కాయి. నాస్ట్రడామస్‌ చెప్పినట్లు ఈ సంవత్సరాంతానికి ప్రళయం సంభవించి మానవ కోటి నశిస్తుందని విశ్వసిస్తున్నవారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.

ఈ భయాందోళనకు ఆస్కారమే లేదంటున్నారు చైనా జ్యోతిష్యులు. అగ్ని, భూమి, లోహం, నీరు, కర్ర అనే అయిదు ఎలిమెంట్లను విశ్వసించే చైనీయులు 2012 నీటి ఆధారిత సంవత్సరంగా అంఛనా వేస్తున్నారు. ఈ సంవత్సరం భూమి మీద నీటి ప్రభావమే అధికంగా వుంటుందంటున్నారు. నీటి ప్రభావం తీవ్రంగా వుండి వరదలకు అవకాశముందని కొందరంటుంటే... సమృద్దిగా కురిసే వర్షాలతో భూమి సస్యశ్యామలమవుతుందని మరికొందరు చెబుతున్నారు.

సంవత్సరం మీద నీటి ప్రభావం వల్లనే భారత్‌, పాకిస్తాన్‌, ఇండోనేసియా, చైనా లోని కొన్ని ప్రాంతాలు భారీ వరదల పాలవుతాయని అంటున్నారు. అయితే... వెస్టర్న్‌ ఆస్ట్రాలజర్స్‌ చెబుతున్నట్లు ఈ వరదలతో ప్రపంచం అంతం కాదని ఖరాఖండీగా తేల్చేశారు చైనా జ్యోతిష్యులు.

Published Date : Wednesday, 25/1/2012 11:46 AM IST
Related Articles
Gallery