APEPDCL: పదవతరగతి అర్హతతో లైన్‌మెన్ ఉద్యోగాలు.. రెండు రోజుల్లో దరఖాస్తు గడువు పూర్తి..

APEPDCL: పదవతరగతి అర్హతతో లైన్‌మెన్ ఉద్యోగాలు.. రెండు రోజుల్లో దరఖాస్తు గడువు పూర్తి..
APEPDCL తన పరిధిలోని ఐదు సర్కిళ్లలో మొత్తం 398 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

APEPDCL: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (APEPDCL) లో ఎనర్జీ అసిస్టెంట్ (జూనియర్ లైన్‌మెన్ గ్రేడ్ -2) పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. APEPDCL తన పరిధిలోని ఐదు సర్కిళ్లలో మొత్తం 398 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.apeasternpower.com/ వెబ్‌సైట్ చూడొచ్చు.

అర్హతలు: ఎలక్ట్రికల్, వైరింగ్ విభాగంలో ఐటీఐ లేదా ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లయన్సెస్ విభాగంలో రెండేళ్ల ఒకేషనల్ ఇంటర్మీడియెట్ కోర్సు చేసిన పురుష అభ్యర్తులు అర్హులు. అలాగే అభ్యర్థులకు ఈ ఏడాది జులై 1 నాటికి 18 ఏళ్లు నిండి 35 ఏళ్ల లోపు వయసు ఉండాలి. గతంలో పదో తరగతి మార్కుల ఆధారంగా జరిగిన ఎంపిక విధానంలో ఎదురైన ఇబ్బందుల దృష్ట్యా ఈసారి రాత పరీక్ష నిర్వహిస్తున్నారు. దీనిలో ఉత్తీర్ణులైన వారిని మాత్రమే శారీరక సామర్థ్య పరీక్ష (ఫిజికల్ టెస్ట్) కు పిలుస్తారు.

సర్కిళ్ల వారీగా పోస్టుల వివరాలు:

శ్రీకాకుళం: 88

విజయనగరం: 74

విశాఖపట్నం: 71

రాజమండ్రి: 122

ఏలూరు: 43

ముఖ్య సమాచారం:

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 24, 2021

రాత పరీక్ష: అక్టోబర్ 10 (ఉదయం 11 గంటల నుంచి 12.45 గంటల వరకు)

రాత పరీక్ష ఫలితాలు: అక్టోబర్ 22, 2021

ఫిజికల్ టెస్ట్ (విద్యుత్ స్తంభం ఎక్కడం, మీటర్ రీడింగ్ చూడడం, సైకిల్ తొక్కడం): నవంబర్ 1 నుంచి 6 వరకు

ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా: నవంబర్ 15, 2021

నియామక పత్రాలు అందజేత: నవంబర్ 17, 2021

ఏఈలకు రిపోర్ట్ చేయాల్సింది: నవంబర్ 29, 2021

ఓరియంటేషన్ కార్యక్రమం: నవంబర్ 30 నుంచి డిసెంబర్ 1 వరకు

గ్రామ, వార్డు సచివాలయాల్లో సెక్రటరీలకు రిపోర్ట్ చేసి విధుల్లో చేరే తేదీ: డిసెంబర్2, 2021

------------------

Tags

Read MoreRead Less
Next Story