తెలంగాణ ఎంసెట్ ఫలితాలు నేడే

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు నేడే

తెలంగాణలో ఇవాళ ఎంసెట్‌ ఫలితాలు విడుదల కానున్నాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్‌ టి. పాపిరెడ్డి మధ్యాహ్నం 12.30 గంటలకు ఫలితాలను విడుదల

చేయనున్నారు. జేఎన్‌టీయూ, కూకట్‌పల్లి క్యాంపస్‌లోని ఆడిటోరియంలో ఫలితాలను విడుదల చేస్తారు. ఇంటర్‌ ఫలితాలను ఇంటర్ బోర్డు ఎంసెట్‌ కమిటీకి అందజేయగా.. ఎంసెట్‌ ఫలితాలను ఇవాళ విడుదల చేయనున్నారు అధికారులు. ఇంటర్‌లో వచ్చిన మార్కుల్లో 25 శాతం ఎంసెట్‌లో వెయిటేజీ ఉంటుంది కాబట్టి ఎంసెట్ ఫలితాలు విడుదల చేయాలంటే ఇంటర్ మార్కుల్ని జేఎన్టీయూకు ఇంటర్ బోర్డు అందించాలి.ఇంటర్ బోర్డు విద్యార్థుల మార్కుల్ని జేఎన్టీయూకు పంపడం ఆలస్యం కావడంతో ఎంసెట్ ఫలితాలు కూడా ఆలస్యం అయ్యాయి. తెలంగాణలో ఎంసెట్ రాసిన లక్షలాది మంది విద్యార్థులు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎంసెట్ పరీక్షకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్షా 42వేల216 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో లక్షా31వేల 209 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇంజనీరింగ్ విభాగానికి మే 3వ తేదీ నుంచి మే 9వ తేదీ వరకు ఎంసెట్ పరీక్షలు జరిగాయి.

Tags

Read MoreRead Less
Next Story