IBPS Clerk Recruitment 2021: డిగ్రీ అర్హతతో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పోస్టులు..

IBPS Clerk Recruitment 2021: డిగ్రీ అర్హతతో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పోస్టులు..
IBPS Clerk Recruitment 2021: బ్యాంకు ఉద్యోగం చేయాలని కలగనే వారికి ఓ మంచి అవకాశం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో భారీగా క్లర్క్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది.

IBPS Clerk Recruitment 2021: బ్యాంకు ఉద్యోగం చేయాలని కలగనే వారికి ఓ మంచి అవకాశం. ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (IBPS) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో భారీగా క్లర్క్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. దేశవ్యాప్తంగా 7855 క్లర్క్ పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది.

తెలుగు రాష్ట్రాల్లో 720 పోస్టులు ఉన్నాయి. తెలంగాణలో 333, ఆంధ్రప్రదేశ్‌లో 387 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు ఆఖరు తేదీ అక్టోబర్ 27. తెలంగాణలోని అభ్యర్ధులు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ భాషల్లోనూ, ఆంధ్రప్రదేశ్‌లోని అభ్యర్ధులు ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషల్లో ఎగ్జామ్ రాయొచ్చు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏఏ బ్యాంకుల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూద్దాం.

తెలంగాణలోని క్లర్క్ పోస్టుల వివరాలు..

మొత్తం ఖాళీలు - 333

బ్యాంక్ ఆఫ్ ఇండియా - 5

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర - 10

కెనరా బ్యాంక్ - 1

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - 34

ఇండియన్ బ్యాంక్ - 60

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ - 16

పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ - 2

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - 205

ఆంధ్రప్రదేశ్‌లోని క్లర్క్ పోస్టుల వివరాలు..

మొత్తం ఖాళీలు - 387

బ్యాంక్ ఆఫ్ ఇండియా - 9

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర - 4

కెనరా బ్యాంక్ - 3

ఇండియన్ బ్యాంక్ - 120

పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ - 3

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - 248

ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ పాసైన అభ్యర్ధులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధులకు కంప్యూటర్ సిస్టమ్స్ ఆపరేట్ చేసే నైపుణ్యం ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్స్ లేదా లాంగ్వేజ్‌లో సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ ఉండాలి.

అభ్యర్ధులకు సంబంధిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన అధికార భాషలో నైపుణ్యం ఉండాలి. అంటే ఆ భాషలో చదవడం, రాయడంతో పాటు మాట్లాడడం కూడా తెలిసి ఉండాలి.

ఇక పరీక్షా కేంద్రాల విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌లో పరీక్షా కేంద్రాలు ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story