డిగ్రీ అర్హతతో బ్యాంకు ఉద్యోగాలు.. 4336 పోస్టులకు ‘ఐబీపీఎస్’ నోటిఫికేషన్

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)/మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఎంటీ) పోస్టుల భర్తీకి ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆగస్టు 7 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.100లు, ఇతరులు రూ.600 చెల్లించి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 28 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. రెండు దశల్లో రాతపరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
ప్రొబేషనరీ ఆఫీసర్లు/మేనేజ్‌మెంట్ ట్రైనీలు: 4336 పోస్టులు…. అర్హత: ఏదైనా డిగ్రీ..వయోపరిమితి: 01.08.2019 నాటికి 20 – 30 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా ..ఎంపిక విధానం: ప్రిలిమనరీ, మెయిన్స్ రాతపరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా
ముఖ్యమైన తేదీలు.. ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 07.08.2019.. ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 28.08.2019.. ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్‌లెటర్ డౌన్‌లోడ్ సెప్టెంబర్ 2019. ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ పరీక్ష తేదీ 23.09.2019 నుంచి 28.09.2019. ప్రిలిమినరీ పరీక్ష(ఆన్‌లైన్) కాల్ లెటర్ డౌన్‌లోడ్ అక్టోబరు 2019. ప్రిలిమినరీ పరీక్ష అక్టోబరు 12,13,19,20. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు అక్టోబరు/నవంబరు 2019. మెయిన్ ఎగ్జామ్ కాల్ లెటర్ డౌన్‌లోడ్ నవంబరు 2019. మెయిన్ ఎగ్జామ్ 30.11.2019. మెయిన్ ఎగ్జామ్ ఫలితాలు డిసెంబరు 2019. ఇంటర్వ్యూ కాల్ లెటర్ డౌన్‌లోడ్ జనవరి 2020. ఇంటర్వ్యూ జనవరి/ఫిబ్రవరి 2020. నియామకం ఏప్రిల్ 2020.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *