Indian Navy Recruitment 2021: ఇంటర్ అర్హతతో నేవీలో ఉద్యోగాలు.. జీతం రూ.21,700 నుంచి..

Indian Navy Recruitment 2021:  ఇంటర్ అర్హతతో నేవీలో ఉద్యోగాలు.. జీతం రూ.21,700 నుంచి..
Indian Navy Recruitment 2021: ఇండియన్ నేవీ 2500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Indian Navy Recruitment 2021: ఇండియన్ నేవీ 2500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 2022 ఫిబ్రవరి బ్యాచ్ ద్వారా ఆర్టిఫిషర్ అప్రెంటీస్ (ఏఆర్), సీనియర్ సెకండరీ రిక్రూట్స్ (ఎస్ఎస్ఆర్) పోస్టులను భర్తీ చేయనుంది. అవివాహిత పురుష అభ్యర్ధులు అర్హులు. ఇంటర్ ఎంపీసీ గ్రూప్ చేసి ఉండాలి.

నేవీలో ప్రధానంగా ఆఫీసర్స్, సెయిలర్స్, సివిలియన్స్ మూడు రకాల పోస్టులు ఉంటాయి. ఆఫీసర్స్ పోస్టులను యూపీఎస్సీ డిఫెన్స్ సర్వీస్, నేవల్ అకాడమీ ద్వారా భర్తీ చేస్తుండగా సెయిలర్స్, సివిలియన్స్ పోస్టుకు ఇండియన్ నేవీ విడిగా నోటిఫికేషన్స్ ఇస్తోంది. ప్రస్తుతం 2021 ఆగస్టు బ్యాచ్ ద్వారా సెయిలర్స్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలకు https://www.koinindiannavy.gov.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.

మొత్తం ఖాళీలు: 2500

1. ఆర్టిఫిషర్ అప్రెంటిస్ (ఏఏ)

అర్హత: ఇంటర్మీడియెట్/10+2లో కనీసం 60 శాతం మార్కులతో మ్యాథ్య్, ఫిజిక్స్‌తో పాటు కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్ సైన్స్ చదివి ఉండాలి.

వయసు: 01.02.2002 నుంచి 31.01.2005 మధ్య జన్మించి ఉండాలి.

2. సీనియర్ సెకండరీ రిక్రూట్స్ (ఎస్ఎస్ఆర్)

అర్హత: ఇంటర్మీడియెట్/10+2లో కనీసం 60 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్‌తో పాటు కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్ సైన్స్ చదివి ఉండాలి.

వయసు: 01.02.2002 నుంచి 31.01.2005 మధ్య జన్మించి ఉండాలి.

ముఖ్య సమాచారం..

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్ 16, 2021

చివరి తేదీ: అక్టోబర్ 25, 2021

వెబ్‌సైట్: https://www.joinindiannavy.gov.in/

ఎంపిక ప్రక్రియ..

ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్, మెడికల్ ఎగ్జామ్ మూడు దశల్లో ఎంపిక జరుగుతుంది. ఆర్టిఫిషర్ అప్రెంటీస్‌కు దేశవ్యాప్తంగా నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్‌ టెస్టులో మెరిట్, సీనియర్ సెకండరీ రిక్రూట్స్‌కు స్టేట్‌వైజ్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ టెస్టులో అర్హత సాధించిన కనీసం 10 వేల మందిని

ఫిజికల్ టెస్టులకు ఎంపిక చేస్తారు. అందులో క్వాలిఫై అయిన వారికి మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు.

పరీక్షవిధానం..

గత ఏడాది పరీక్ష విధానం ప్రకారం చూస్తే.. ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో 100 మార్కులకు 100 ప్రశ్నలిస్తారు. సమయం 60 నిమిషాలు. ఇంటర్ స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లీష్, హిందీ మీడియంలో ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఒక తప్పు సమాధానానికి 1/4 మార్కు మైనస్ అవుతుంది. సెక్షనల్ కటాఫ్‌తో పాటు ఓవరాల్ కటాఫ్ మార్కులు పొందాలి.

ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్..

ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. 7 నిమిషాల్లో 1.6 కిలోమీటర్లు పరిగెత్తడంతో పాటు 20 సిట్‌అప్స్, 10 పుష్‌అప్స్ చేయాల్సి ఉంటుంది. క్రీడలు, స్విమ్మింగ్, ఇతర కరిక్యులర్ యాక్టివిటీస్‌లో సర్టిఫికెట్ కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.

మెడికల్ స్టాండర్డ్స్..

కనీసం 157 సెం.మీ ఎత్తు ఉండాలి. గాలి పీల్చినప్పుడు చాతి 5 సెం.మీ విస్తరించాలి. చెవులు, దంతాలు శుభ్రంగా ఉండాలి. అద్దాలు ఉన్నా లేకున్నా కంటిచూపు 6/6 గా ఉండాలి. ముంజేతి లోపలి భాగంలో మాత్రమే టాటూలు అనుమతిస్తారు. శరీరంలో ఏ ఇతర భాగంలో పచ్చ బొట్టు ఉండకూడదు.

శిక్షణ..

ఈ పోస్టులకు ఎంపికైన వారికి ఫిబ్రవరి 2022 ప్రారంభమయ్యే ట్రైనింగ్‌లో నెలకు రూ.14,600 స్టైఫండ్ ఉంటుంది. శిక్షణ పూర్తిచేసుకున్న వారిని లెవెల్-3లో 20 ఏళ్ల పాటు (ఎస్ఎస్ఆర్ కు 15 ఏళ్లు) సర్వీసులో నియమిస్తారు. వారికి నెలకు జీతం రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉంటుంది. లెవల్ 8 వరకు ప్రమోషన్ పొందితే నెలకు దాదాపు లక్ష వేతనం అందుకోవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story