Oil India Recruitment: పది, ఇంటర్ అర్హతతో ఆయిల్ ఇండియాలో ఉద్యోగాలు.. జీతం రూ.26,600

Oil India Recruitment: పది, ఇంటర్ అర్హతతో ఆయిల్ ఇండియాలో ఉద్యోగాలు.. జీతం రూ.26,600

Oil India Recruitment: ఆయిల్ ఇండియా లిమిటెడ్-జూనియర్ అసిస్టెంట్ (క్లర్క్ కం కంప్యూటర్ ఆపరేటర్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 120

ఇందులో ఎస్సీలకు 8, ఎస్టీలకు 14, ఓబీసీలకు 32, ఈడబ్ల్యూఎస్‌లకు 12, జనరల్ అభ్యర్ధులకు 54 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.

అర్హత: కనీసం 40 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్/ పన్నెండో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఆరు నెలల డిప్లొమా కంప్యూటర్ అప్లికేషన్స్ పూర్తి చేసి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ ఎక్స్ఎల్ తెలిసి ఉండాలి.

వయసు: ఆగస్టు 15 నాటికి అభ్యర్థులకు 18 నుంచి 30 ఉళ్ల మధ్య వయసుండాలి.

పరీక్ష ఎలా ఉంటుంది.. క్వశ్చన్ పేపర్లో మొత్తం మూడు సెక్షన్లు ఉంటాయి. మొదటి సెక్షన్‌లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ నాలెడ్జ్/అవేర్‌నెస్, ఆయిల్ ఇండియా సమాచారానికి సంబంధించి 20 ప్రశ్నలు అడుగుతారు. రెండో సెక్షన్‌లో రీజనింగ్, అర్థమెటిక్/ న్యూమరికల్ అండ్ మెంటల్ ఎబిలిటీ అంశాలనుంచి 20 ప్రశ్నలు ఇస్తారు. మూడో సెక్షన్‌లో డొమైన్/టెక్నికల్ నాలెడ్జ్ అంశాల నుంచి 60 ప్రశ్నలు అడుగుతారు. పరీక్షను ఇంగ్లీష్, అస్సామీ భాషల్లో నిర్వహిస్తారు. పరీక్ష సమయం రెండు గంటలు. రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

ప్రారంభ వేతనం నెలకు : రూ. 26,600

దరఖాస్తు ఫీజు: రూ.200

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 8

వెబ్‌సైట్: https://www.oilindia.com/

Tags

Read MoreRead Less
Next Story