film making: ఫిల్మ్ మేకింగ్ మీద ఆసక్తి ఉన్నవారికి సదవకాశం.. లక్ష రూపాయలు గ్రాంట్..

film making: ఫిల్మ్ మేకింగ్ మీద ఆసక్తి ఉన్నవారికి సదవకాశం.. లక్ష రూపాయలు గ్రాంట్..
film making: ఆసక్తి ఉన్నవారు ఈ ఫిల్మ్ ఫెలోషిప్ ద్వారా తమ ప్రతిభకు మరింత పదును పెట్టుకునే అవకాశం.

film making: ఫిల్మ్ మేకింగ్ మీద ఆసక్తి ఉన్న వారికి ఓ చక్కని సదవకాశం. సామాజిక సమస్యలపై కథ, కథనాలు రాసి చక్కని ప్రతిభ కలిగిన ఫిల్మ్ మేకర్లను గుర్తించేందుకు ఇండియా సిఎస్‌ఆర్‌తో కలిసి హైఫెన్ సినీ ఇంపాక్ట్ ఫిల్మ్ ఫెలోషిప్ 2021ను అందిస్తోంది. ఆసక్తి ఉన్నవారు ఈ ఫిల్మ్ ఫెలోషిప్ ద్వారా తమ ప్రతిభకు మరింత పదును పెట్టుకునే అవకాశం.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయసు 25 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు విధానం పూర్తిగా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. ఈ ఫిల్మ్ మేకింగ్ ఫెలోషిప్‌లో రూ.లక్ష గ్రాంట్ అందిస్తారు. అంతే కాకుండా అవార్డు కింద మరో లక్ష వరకు అందుతుంది. మరిన్ని వివరాల కోసం వెబ్‌సైట్ https://thehyphen.in/cine-impact/ ను సందర్శించాలి.

ఫెలోషిప్ వివరాలు..

' NGO అు మరియు కార్పొరేట్ కంపెనీల ద్వారా నిర్వహించబడే కమ్యూనిటీ కార్యక్రమాలపై చిత్రాను రూపొందించడానికి రెండు నెలల సమయం ఇస్తారు.

* టీమ్ సభ్యులతో కలిసి మంచి డాక్యుమెంట్ తయారు చేసి ఫెలోషిప్‌లో అందించాలి.

* మీరు తయారు చేసిన డాక్యుమెంట్ సామాజిక ఆర్థిక సమస్యలను ప్రతిబింబించేదిగా ఉండాలి.

బహుమతులు, రివార్డులు..

' ఫిల్మ్ మేకింగ్ గ్రాంట్ రూ. 1,00,000 వరకు

* రూ.1,00,000 విలువైన నగదు బహుమతులు

* ఫిల్మ్ మేకింగ్ బూట్‌క్యాంప్ అండ్ మెంటర్ షిప్ లభిస్తుంది.

ఎంపిక విధానం..

* అభ్యర్థి నుంచి అక్టోబర్ 15, 2021 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

* నవంబర్ 1, 2021న దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేస్తారు.

* నవంబర్ 8, 2021 వరకు బూట్ క్యాంప్ నిర్వహిస్తారు.

* నవంబర్ 15, 2021 వరకు ఫిల్మ్ మేకింగ్ ప్రారంభమవుతుంది.

* ఫిబ్రవరి 15, 2021 వరకు తుది సబ్మిషన్ చేయాలి.

* ఫిబ్రవరి 20, 2021న గ్రాండ్ ఫైనల్ ఉంటుంది.

* ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

* ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://thehyphen.in/cine-impact/ ను సందర్శించాలి.

* పార్టిసిపెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పూర్తి వివరాలు అందించాలి.

Tags

Read MoreRead Less
Next Story