Postal Jobs 2021: టెన్త్, ఇంటర్ అర్హతతో పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు.. జీతం రూ.25,500

Postal Jobs 2021: టెన్త్, ఇంటర్ అర్హతతో పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు.. జీతం రూ.25,500
Postal Jobs 2021: పోస్టాఫీసుల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది ఇండియా పోస్టల్ శాఖ.

Postal Jobs 2021: పోస్టాఫీసుల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది ఇండియా పోస్టల్ శాఖ. ఢిల్లీ పోస్టల్ సర్కిల్‌లో పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్, అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, పోస్ట్‌మ్యాన్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల అయింది. స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. మొత్తం 221 పోస్టులు ఉన్నాయి. క్రీడల్లో రాణించిన వారు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలు..

మొత్తం ఖాళీలు.. 221

పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్: 72 (ఇంటర్ విద్యార్హత)

పోస్ట్‌మ్యాన్ : 90 (ఇంటర్ పాస్)

మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 59 (టెన్త్ అర్హత)

గుర్తుంచుకోవాల్సిన అంశాలు..

దరఖాస్తు ప్రారంభం: 2021 అక్టోబర్ 4

దరఖాస్తుకు చివరి తేదీ: 2021 నవంబర్ 12

అర్హతలు: అభ్యర్ధులకు నోటిఫికేషన్‌లో సూచించిన విద్యార్హతలతో పాటు క్రీడార్హతలు కూడా తప్పనిసరిగా ఉండాలి.

వయస్సు: పోస్ట్‌మ్యాన్, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ పోస్టులకు 18 నుంచి 27 ఏళ్లు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్లు.

దరఖాస్తు ఫీజు: రూ.100

వేతనం: పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు రూ.25500 బేసిక్ వేతనంతో రూ.81,100 వేతనం, పోస్ట్ మ్యాన్ పోస్టుకు రూ.21,700, బేసిక్ వేతనంతో

రూ.69,100 వేతనం, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు రూ.18,000 బేసిక్ వేతనంతో రూ.56,900 వేతనం లభిస్తుంది.

దరఖాస్తు విధానం:

* అభ్యర్ధులు https://www.indiapostgov.in/వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.

* జాబ్ నోటిఫికేషన్‌లోనే దరఖాస్తు ఫార్మాట్ ఉంటుంది.

* అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని పూర్తి చేయాలి.

* అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి.

* దరఖాస్తుల్ని నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్‌లో పంపాలి.

దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్..

Assistant Director (R&E)

O/o the Chief Postmaster General

Delhi Circle, Meghdoot Bhawan

New Delhi-110001

Tags

Read MoreRead Less
Next Story