SCR Recruitment 2021: పది అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు.. సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్లలో..

SCR Recruitment 2021: పది అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు.. సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్లలో..
SCR Recruitment 2021: రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్, దక్షిణ మధ్య రైల్వే (RRC SCR) అప్రెంటీస్ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

SCR Recruitment 2021: రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్, దక్షిణ మధ్య రైల్వే (RRC SCR) అప్రెంటీస్ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్ scr.indianrailways.gov.in చూడవచ్చు.

సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని రైల్వే శాఖ వివిధ విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం 4103 ఖాళీలు. నవంబర్ 3 అప్లికేషన్‌కు ఆఖరు తేదీ.

దక్షిణ మధ్య రైల్వే అప్రెంటీస్ ఖాళీ

అప్రెంటిస్ - 4143 పోస్టులు

ఏసీ మెకానిక్ - 250

వడ్రంగి - 18

డీజిల్ మెకానిక్ - 531

ఎలక్ట్రీషియన్ - 1019

ఎలక్ట్రానిక్ మెకానిక్ - 92

ఫిట్టర్ - 1460

మెషినిస్ట్ - 71

MMTW - 5

MMW - 24

పెయింటర్ - 80

వెల్డర్ - 553

అర్హత

అభ్యర్థులు 10 వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి లేదా దానికి సమానమైన (10+2 పరీక్షా విధానంలో) గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50% మార్కులు ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో ITI ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయో పరిమితి:

15 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల వరకు దక్షిణ మధ్య రైల్వే అప్రెంటీస్ పోస్టుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

10 వ తరగతి మరియు ITI పరీక్ష రెండింటిలోనూ అభ్యర్థులు సాధించిన సగటు మార్కుల శాతాన్ని తీసుకొని మెరిట్ జాబితాను తయారు చేస్తారు.

ఎలా అప్లై చేయాలి?

అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ (scr.indianrailways.gov.in) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు:

1 - అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి (లింక్ పైన ఇవ్వబడింది)

2 - 'యాక్ట్ అప్రెంటీస్ శిక్షణ కోసం ఆన్‌లైన్ అప్లికేషన్ - 2021' పై క్లిక్ చేయండి

3 - రిజిస్ట్రేషన్ కోసం, మీ మొబైల్ నంబర్, ఇ -మెయిల్ ID ని కూడా జత చేయాల్సి ఉంటుంది.

4 - దరఖాస్తు ఫారమ్ ఫిల్ చేయాలి.

5 - పూర్తి చేసిన దరఖాస్తును అప్‌లోడ్ చేసి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

6 - పూర్తి చేసిన దరఖాస్తు సమర్పించిన తర్వాత, రిజిస్ట్రేషన్ నంబర్ జనరేట్ చేయబడుతుంది. సంబంధిత వివరాలు మీ మొబైల్ నంబర్, ఇ -మెయిల్ ఐడికి పంపబడుతుంది. తదుపరి కమ్యూనికేషన్ ప్రక్రియకు ఇది ఉపయోగపడుతుంది.

దరఖాస్తు రుసుము:

రూ. 100/- (SC/ST/మహిళా/PWD అభ్యర్థులకు ఫీజు లేదు)

Tags

Read MoreRead Less
Next Story