పదోతరగతి అర్హతతో 25వేల పోస్టులు.. వేతనం రూ.21 వేలు.. రేపే అప్లైకి ఆఖరు

పదోతరగతి అర్హతతో 25వేల పోస్టులు.. వేతనం రూ.21 వేలు.. రేపే అప్లైకి ఆఖరు
పదో తరగతి/తత్సమాన అర్హతతో భారీ మొత్తంలో నిరుద్యోగుల కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) గత నెలలో నోటిఫికేషన్

పదో తరగతి/తత్సమాన అర్హతతో భారీ మొత్తంలో నిరుద్యోగుల కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) గత నెలలో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలో బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఎస్ఎస్బీ, ఐడీబీపీ, ఏఆర్, ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్ తదితర విభాగాల్లో సుమారు 25వేల కానిస్టేబుల్ జీడీ (జనరల్ డ్యూటీ) పోస్టులకు గత నెల 17న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. కాగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు ఆఖరు తేదీ రేపే (31.08.21). ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని ఈ చివర నిమిషాన్ని అయినా ఉపయోగించుకోవచ్చు.

విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్శిటీకి సంబంధించిన పదో తరగతి/ మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత సర్టిఫికెట్ ఉండాలి.

అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.100, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్విస్‌మ్యాన్ కేటగిరికి చెందిన వారికి అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు లభిస్తుంది.

అప్లికేషన్ ఫీజుకు చివరి తేదీ: ఆన్‌లైన్ ద్వారా 02.09.2021 (23:30) తేదీ వరకు చెల్లించాలి. ఆఫ్‌లైన్ ద్వారా అయితే 04.09.2021 (23:30) తేదీ వరకు చెల్లించొచ్చు.

వయసు : 18 నుంచి 23 సంవత్సరాలు (నిబంధనల ప్రకారం వయసు పరిమితిలో సడలింపులు)

వేతనం: ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు రూ.21 వేల నుంచి గరిష్టంగా రూ.69 వేల వరకు వేతనంగా పొందొచ్చు.

వెబ్‌సైట్: https://ssc.nic.in/

Tags

Read MoreRead Less
Next Story