SSC MTS Havaldar Recruitment 2022: టెన్త్ అర్హతతో హవల్దార్ ఉద్యోగాలు.. జీతం రూ.18000-30749

SSC MTS Havaldar Recruitment 2022: టెన్త్ అర్హతతో హవల్దార్ ఉద్యోగాలు.. జీతం రూ.18000-30749
SSC MTS Havaldar Recruitment 2022: SSC హవల్దార్ పోస్టుల భర్తీకిగాను నోటిఫికేషన్ జారీ చేయబడింది.

SSC MTS Havaldar Recruitment 2022: స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (SSC) 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు హవల్దార్లు, మల్టీ టాస్కింగ్ (నాన్-టెక్నికల్) సిబ్బందిగా నియమింపబడతారు.

ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో మొత్తం 3603 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీలు: 22-03-2022 నుండి 30-04-2022 వరకు

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ : 30-04-2022

ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చేయడానికి చివరి తేదీ: 02-05-2022

కంప్యూటర్ ఆధారిత పరీక్ష షెడ్యూల్ (పేపర్-I): జూలై, 2022

పేపర్-II పరీక్ష తేదీలు (డిస్క్రిప్టివ్): తర్వాత తెలియజేయబడుతుంది

ఖాళీలు

మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) సిబ్బంది - త్వరలో తెలియజేస్తారు

హవల్దార్: 3603 పోస్టులు

వయో పరిమితులు

CBN (రెవెన్యూ శాఖ)లో MTS మరియు హవల్దార్‌కు 18-25 సంవత్సరాలు (అంటే 02-01-1997 కంటే ముందు జన్మించిన వారు అర్హులు)

CBIC (రెవెన్యూ శాఖ)లో హవల్దార్, MTS పోస్ట్‌లకు 18-27 సంవత్సరాలు (అంటే 02-01-1995కి ముందు జన్మించిన వారు అర్హులు)

దరఖాస్తు రుసుము

జనరల్ అభ్యర్ధులకు రూ 100/- , రిజర్వేషన్‌కు అర్హులైన షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), వికలాంగులు (PwD) మరియు Exservicemen (ESM)కి చెందిన మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.

విద్యార్హత

అభ్యర్థులు తప్పనిసరిగా మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి లేదా గుర్తింపు పొందిన బోర్డు నుండి తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు విధానము

దరఖాస్తులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ మోడ్‌లో సమర్పించాలి.

జీతం..

బేసిక్ పే : 18000.. డియర్నెస్ అలవెన్స్, ఇంటి అద్దె, ట్రాన్స్ పోర్ట్ చార్జీలు అన్నీ కలుపుకుని నెలకు 30749/- వస్తుంది.

మరిన్ని వివరాలకు వెబ్ సైట్ ssc.nic.in చూడవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story