SSC Jobs 2021: టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. అప్లైకి ఆఖరు..

SSC Jobs 2021: టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. అప్లైకి ఆఖరు..
SSC Jobs 2021: స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వేర్వేరు విభాగాల్లో 3261 ఖాళీలను భర్తీ చేయనుంది.

SSC Jobs 2021: స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వేర్వేరు విభాగాల్లో 3261 ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకునేందుకు ఆఖరు తేదీ అక్టోబర్ 25. దరఖాస్తు అనంతరం ఫీజు చెల్లించేందుకు అక్టోర్ 28 రాత్రి 11.30 వరకు అవకాశం ఉంది.

రాత పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. 2022లో జనవరి లేదా ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తరువాత పరీక్ష తేదీలు విడుదల చేస్తారు. అభ్యర్దులు పూర్తి వివరాలకు https://ssc.nic.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.

పోస్టులు:

మల్టీ టాస్కింగ్ స్టాఫ్, రీసెర్చ్ అసిస్టెంట్, గర్ల్స్ కేడెట్ ఇన్‌స్ట్రక్టర్, కెమికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్, ల్యాబొరేటరీ అటెండెంట్, మెడికల్ అటెండెంట్, టెక్స్‌టైల్ డిజైన్ తదితర పోస్టులు ఉన్నాయి.

ఎంపిక ప్రక్రియ-పరీక్ష విధానం:

ప్రాథమికంగా కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయంల 60 నిమిషాలు. ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. పోస్టును బట్టి విద్యార్హతలు ఉంటాయి.. ఆ ప్రకారంగా పరీక్షలు నిర్వహిస్తారు. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి పరీక్ష జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది. పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని స్కిల్ టెస్ట్‌కు పిలుస్తారు.

పరీక్ష విధానం:

జనరల్ ఇంటిలిజెన్స్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్.. ఒక్కోవిభాగంలో 50 మార్కులకు 25 ప్రశ్నలుంటాయి.

ముఖ్య సమాచారం:

విద్యార్హతలు: పోస్టులను బట్టి విద్యార్హతలు ఉంటాయి.

వయసు: అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్లుగా ఉంది. అయితే రిజర్వేషన్‌ల ప్రకారం ఆయా విభాగాల వారీగా వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

దరఖాస్తు విధానం:

అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునేందుకు ఫీజు రూ.100, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈఎస్ఎం,కేటగిరి అభ్యర్ధులకు, మహిళలకు పరీక్ష ఫీజు లేదు..

మొదట అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in సందర్శించాలి.

అందులో NOTICES లోకి వెళ్లి OTHERS విభాగంలో నోటిఫికేషన్ చదవాలి. అనంతరం హోం పేజికి వచ్చి దరఖాస్తు ప్రక్రియ మొదలు పెట్టాలి. మొదట వన్‌టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అభ్యర్థి ప్రాథమిక విద్యార్హత, పాస్ పోర్టు ఫోటో, సంతకం అప్ లోడ్ చేసి ఫాం సబ్‌మిట్ చేయాలి. ఈ ప్రక్రియ అనంతరం అభ్యర్థికి రిజిస్ట్రేషన్ నంబర్, పాస్ వర్డ్ వస్తాయి. రెండో భాగంలో రిజిస్ట్రేషన్ నంబర్ పాస్ వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. అనంతరం ఏ పోస్టుకు దరఖాస్తు చేస్తున్నారో క్లిక్ చేసి సమాచారం అందించడంతో పాటు, ఫీజు చెల్లించి సబ్‌మిట్ చేయాలి.


Tags

Read MoreRead Less
Next Story