ఇస్రోలో ఉద్యోగాలు.. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా నియామకం

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో అనుబంధ సంస్థ అయిన విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ VSSC ఉద్యోగాల భర్తీ చేపట్టింది. టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని ఆగస్ట్ 17న జరిగే ఇంటర్వ్యూకు నేరుగా హాజరు కావచ్చు. అభ్యర్థులు www.mhrdnats.gov.in లేదా www.sdcentre.org వెబ్‌సైట్‌లో ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. కేరళలోని ఎర్నాకులం జిల్లా కలామస్సెరీలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆగస్ట్ 17న ఉదయం 9.30 గంటల నుంచి సాయింత్రం 5 గంటల వరకు ఇంటర్వ్యూకు హాజరు కావాలి. టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులు మొత్తం: 158.. ఆటోమొబైల్: 8.. కెమికల్: 25.. సివిల్: 8.. కంప్యూటర్ సైన్స్: 15.. ఎలక్ట్రికల్: 10.. ఎలక్ట్రానిక్స్: 40.. ఇన్‌స్ట్రుమెంట్: 6.. మెకానికల్: 46.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *