వైరస్ నిర్మూలనకు ఆయింట్ మెంట్: యుఎస్ ఫార్మా కంపెనీ

వైరస్ నిర్మూలనకు ఆయింట్ మెంట్: యుఎస్ ఫార్మా కంపెనీ
కరోనా తీవ్రతను తగ్గించే ఔషధాలు మార్కెట్లో చాలానే వస్తున్నాయి. తాజాగా వైరస్ కు వ్యతిరేకంగా ఆయింట్ మెంట్

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.. కరోనా తీవ్రతను తగ్గించే ఔషధాలు మార్కెట్లో చాలానే వస్తున్నాయి. తాజాగా వైరస్ కు వ్యతిరేకంగా ఆయింట్ మెంట్ ఒకటి తీసుకువచ్చింది యుఎస్ ఫార్మా కంపెనీ. దీనిని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్-యుఎస్ ఫార్మా కంపెనీ పరీక్షించి ఆమోదముద్ర వేసింది. కరోనా వైరస్ సహా వైరల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి, చికిత్స చేయడానికి ఈ లేపనం నిరూపించబడిందని ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న శాస్త్రవేత్తలు తెలిపారు. "ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం, 30 సెకన్ల టి 3 ఎక్స్ చికిత్స తర్వాత అంటు వైరస్ కనుగొనబడలేదు" అని ఫార్మా కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

"ఇది ముక్కు ద్వారా కరోనావైరస్ బారిన పడే అవకాశాన్ని తగ్గిస్తుందని మేము నమ్ముతున్నాము అని ఇండియానా నుండి వెళ్లిన అడ్వాన్స్‌డ్ పెనెట్రేషన్ టెక్నాలజీ సిఇఒ మరియు వ్యవస్థాపకుడు డాక్టర్ బ్రియాన్ హుబెర్ అన్నారు. నాసికా రంద్రాల ద్వారా కరోనా వైరస్ ను శరీరంలోకి ప్రవేశించకుండా కాపాడుతుంది. తద్వారా ప్రజలు వైరస్ బారిన పడే అవకాశాలను గణనీయంగా తగ్గిస్తుంది. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) యొక్క తాజా అధ్యయనం ప్రకారం ప్రజలు కోవిడ్ -19 మరియు ఇతర వైరస్ లు ప్రధానంగా ముక్కు ద్వారానే సంక్రమిస్తాయి. అయినప్పటికీ, వైరస్ నోటి ద్వారా మరియు కళ్ళ ద్వారా శరీరంలోకి ప్రవేశించవచ్చు.

"టి 3 ఎక్స్ అనేది ఎఫ్‌డిఎ రిజిస్టర్ చేసిన డ్రగ్. అంటే దీనిని ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు. దీనిని ఉపయోగించడం సులభం కాబట్టి వైద్య సిబ్బంది లేదా సాంకేతిక నిపుణుల సహాయం లేకుండా స్వంతగా వాడుకోవచ్చు అని కంపెనీ తెలిపింది. లండన్ ఆధారిత పరిశోధనా ప్రయోగశాల, వైరాలజీ రీసెర్చ్ సర్వీసెస్ లిమిటెడ్, కరోనా వైరస్ (ఎన్ఎల్ 63) మరియు ఇన్ల్పుఎంజా వైరస్‌లకు వ్యతిరేకంగా APT ™ T3X అనే ఈ ఆయింట్ మెంట్ టీ-వైరల్ ప్రభావాన్ని అంచనా వేస్తుంది. మరియు కరోనా వైరస్ కు వ్యతిరేకంగా పోరాడుతుందని పరిశోధకులు తెలిపారు. APT ™ T3X వైరల్ ఇన్ఫెక్టివిటీని సెకన్లలో సమర్థవంతంగా నిర్వీర్యం చేస్తుందని పరిశోధన తేల్చింది. మే, జూన్ రెండు నెలల్లో కరోనా రోగులపై ఆయింట్ మెంట్ కు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. APT ™ T3X అనే ఈ ఆయింట్ మెంట్ ఎనిమిది సంవత్సరాల క్రితం బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల కోసం అభివృద్ధి చేయబడింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 22,864,873 మంది కరోనావైరస్ బారిన పడ్డారని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం యొక్క కోవిడ్ రిసోర్స్ సెంటర్ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story