పాము మాంసం వండి విక్రయిస్తున్న వ్యక్తి..

పాము మాంసం వండి విక్రయిస్తున్న వ్యక్తి..
కేరళలోని ఎర్నాకుళం జిల్లాలోని కొఠమంగళం అటవీ విభాగం అధికారులు పాముని చంపి దాని మాంసాన్ని విక్రయించడానికి ప్రయత్నించిన వ్యక్తిని అరెస్టు చేశారు.

కేరళలోని ఎర్నాకుళం జిల్లాలోని కొఠమంగళం అటవీ విభాగం అధికారులు పాముని చంపి దాని మాంసాన్ని విక్రయించడానికి ప్రయత్నించిన వ్యక్తిని అరెస్టు చేశారు. నెరియా మంగళానికి చెందిన వీజే బిజును అటవీ శాఖ ఆదివారం అరెస్టు చేసింది. అటవీ అధికారుల కథనం ప్రకారం.. బిజు ఎలుకలు చంపి తినే పామును పట్టుకొని దాన్ని ముక్కలు చేసి మాంసం వండాడు. అతడు దాన్ని పైథాన్ మాంసం అని చెప్పి ఆ మాంసాన్ని విక్రయించడానికి ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు అతడు వండిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.

"అతను పైథాన్‌ను పట్టుకున్నట్లు మాకు సమాచారం వచ్చింది. సాధారణంగా, పైథాన్‌లను దాని మాంసం కోసమే వేటాడతారు. కాని కొంతమంది తమకు లభించే పాములనే తింటారు" అని పి.కె.తంపి కోఠమంగళం రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ చెప్పారు."చాలా సందర్భాల్లో పాములు పట్టుకున్న వ్యక్తి ఆధారాలు లభించవు. అప్పుడు మేము ఆ వ్యక్తిపై కేసు నమోదు చేయలేము. కొన్ని సందర్భాల్లో "మేము చాలా ఆలస్యంగా మాకు సమాచారం అందుతుంది. అయినప్పటికీ, వండిన మాంసం లేదా పాము యొక్క అవశేషాలతో నిందితులను పట్టుకునే కేసులు కూడా చాలానే ఉన్నాయి" అని ఉత్తర కేరళకు చెందిన అటవీ అధికారి ఒకరు చెప్పారు.

ఎలుక పాములు విషపూరితం కాని పాములు, ఇవి సాధారణంగా మానవ స్థావరాల దగ్గర కనిపిస్తాయి. ఈ పాములు సాధారణంగా కీటకాలు మరియు ఎలుకలను తింటాయి. ఈ పాములు 8 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. దాని మాంసం కీళ్లనొప్పులకు మంచిదని కొన్ని అపోహలు ఉన్నాయి, కానీ ఇది నిజం కాదు.

Tags

Read MoreRead Less
Next Story