బస్సులో 'లండన్'.. భలే ఉంది ఐడియా

బస్సులో లండన్.. భలే ఉంది ఐడియా
వేరే దేశం వెళ్లాలంటే విమానం ఎక్కాలి. అదే బస్సులో వెళ్తే ఎంచక్కా ఎక్కడ కావాలంటే అక్కడ దిగొచ్చు. ఐడియా ఎవరికి వచ్చిందో..

వేరే దేశం వెళ్లాలంటే విమానం ఎక్కాలి. అదే బస్సులో వెళ్తే ఎంచక్కా ఎక్కడ కావాలంటే అక్కడ దిగొచ్చు. ఐడియా ఎవరికి వచ్చిందో కాని అదిరిపోయింది. ఓ 15 లక్షలు ఉంటే చాలు.. ఒక్క దేశం ఏం ఖర్మ ఏకంగా 18 దేశాలు బస్సులో చుట్టి రావచ్చు. 70 రోజుల పాటు 20వేల కి.మీ సాగే ఈ ప్రయాణానికి శ్రీకారం చుట్టింది గురుగ్రామ్ కు చెందిన అడ్వెంచర్స్ ఓవర్ ల్యాండ్ అనే ట్రావెల్ సంస్థ 'బస్ టు లండన్' పేరుతో ఈ సాహస యాత్రకు రూపకల్పన చేసింది. బస్సు వెళ్లేది దిల్లీ నుంచి బ్రిటన్ రాజధాని లండన్ వరకు సాగుతుంది. మధ్యలో తగిలిన 18 దేశాలపై ఓ లుక్కేయొచ్చు. అవి మయన్మార్, థాయ్ లాండ్, లావోస్, చైనా, కిర్గిస్థాన్, ఉజ్బెకిస్థాన్, కజకిస్థాన్, రష్యా, లాట్వియా, లిథువేనియా, పోలాండ్, చెక్ రిపబ్లిక్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఫ్రాన్స్ దేశాల గుండా ఈ బస్సు వెళుతుంది.

20 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ స్పెషల్ బస్సులో ఇద్దరు డ్రైవర్లు, ఓ గైడ్, సహాయకుడు ఉంటారు. ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లన్నీ ట్రావెల్ ఏజెన్సీనే చూసుకుంటుంది. అయితే ఈ టూర్ ఎప్పుడో మే21న ప్రారంభం కావాల్సి ఉంది. కరోనా వచ్చి బస్సుని ఆపేసింది. దాంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా మొదలు పెట్టలేకపోయింది ట్రావెల్ సంస్థ. అన్ని దేశాలు చూడలేను అన్ని రోజులు ప్రయాణం చేయలేను అని ఎవరైనా అనుకున్నా అక్కడి వరకు టికెట్ తీసుకోవచ్చు. లండన్ వరకు వెళ్లాలంటేనే రూ.15 లక్షలు అవుతుంది. తుషార్ అగర్వాల్, సంజయ్ మదన్ అనే ఇద్దరు ట్రావెల్ ప్రేమికులు 2017, 2018, 2019 సంవత్సరాల్లో లండన్ కు రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం చేసిన తరువాత ఈ బస్ టు లండన్ భావన కార్యరూపం దాల్చింది.

Tags

Read MoreRead Less
Next Story