అమెరికా కోర్టులో TCSకు ఊరట

అమెరికా కోర్టులో TCSకు ఊరట
అమెరికా కోర్టులో TCS కు ఊరట లభించింది. TCS తమ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ని దొంగిలించిందని ఆరోపణలు చేస్తూ.. అమెరికాలోని విస్కాన్సిన్, విరోనాలకు చెందిన హెల్త్ కేర్ సంస్థ ఎపిక్ కంపెనీ లా సూట్ వేసింది.

అమెరికా కోర్టులో TCS కు ఊరట లభించింది. TCS తమ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ని దొంగిలించిందని ఆరోపణలు చేస్తూ.. అమెరికాలోని విస్కాన్సిన్, విరోనాలకు చెందిన హెల్త్ కేర్ సంస్థ ఎపిక్ కంపెనీ లా సూట్ వేసింది. దాదాపు 280 మిలియన్ డాలర్ల నష్టపరిహారం ఇప్పించాలని కోర్టులో కేసు వేసింది. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతుంది. అయితే లా సూట్ లో ఎపిక్ కంపెనీ ఎక్కువ మొత్తానికి అంటే స్థాయికి మించి నష్టపరిహారం కోరుతుందని TCS వాదించింది. దీంతో విచారణ చేపట్టిన కోర్టు దీనిని 140 మిలియన్ డాలర్లకు పరిమితం చేసింది.

మరోవైపు ఈ కేసులో ఎపిక్ సంస్థకు చెందిన వివరాలు దొంగిలించినట్టు ఎలాంటి ఆధారాలు లేవని వాదిస్తోంది. కేసు వేసిన కంపెనీ వద్ద కూడా ఎలాంటి సాక్ష్యాలే లేవని చెబుతోంది. 2014 నుంచి ఈ కేసు నడుస్తోంది. 940 మిలియన్ డాలర్ల నుంచి చివరకు 140 మిలియన్ డాలర్లకు వచ్చింది. అయితే TCS కంపెనీకి కేసులు కొత్తకాదు.. 2019లో CSC టెక్ కంపెనీ కూడా ఇదే తరహా కేసు వేసింది. 2018 ఆగస్టులో సిమోనాల్లి ఇన్నోవేషన్ కూడా తమ సంస్థకు అందించిన సేవల్లో తప్పుడు విధానాలు అవలంభించినట్టు కేసు వేసింది. తర్వాత ఈ కేసులు కొట్టేశాయి అక్కడి కోర్టులు.

Tags

Read MoreRead Less
Next Story