పక్కలో ఉన్న ఆపిల్ ఐఫోన్ పేలడంతో 11 ఏళ్ల చిన్నారి..

పక్కలో ఉన్న ఆపిల్ ఐఫోన్ పేలడంతో 11 ఏళ్ల చిన్నారి..

ఫోన్‌తో ఆటలు.. వేడెక్కిందాకా మాటలు.. పక్కనే పెట్టుకుని నిద్రపోవడం.. ఛార్జింగ్ పెట్టి మాట్లాడడం.. ఇవన్నీ ప్రమాదానికి దారి తీసే అంశాలే. ఒక్కోసారి టైమ్ బావుండకపోతే జేబులో పెట్టుకున్న ఫోన్ కూడా పేలిపోతుంటుంది. లోకల్ మేడ్ ఫోన్లు, తక్కువ ఖరీదు పెట్టి కొన్న ఫోన్లు కాదండోయ్ పేలేది.. ఆపిల్ ఐఫోన్లు కూడా పేలిపోతున్నాయి. మరి దీనికి కారణాలు ఏమైఉంటాయో కంపెనీ వివరించాల్సి ఉంది. అమెరికాకు చెందిన 11ఏళ్ల చిన్నారి అప్పటి వరకు ఫోన్‌తో ఆడి పక్కనే పెట్టుకుని నిద్రపోయింది. చిన్నారి గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా ఫోన్‌ నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. ఏదో కాలుతున్న వాసన వచ్చి వెంటనే దుప్పటి తొలగించి దూరంగా విసిరేసింది. దానితో పాటే ఫోన్ కూడా పడిపోయి పెద్ధ శబ్ధంతో పేలి పోయింది. ఆపిల్ ఐఫోన్ 6 చూస్తుండగానే కాలి బూడిద అయింది. అదృష్టవశాత్తు పాపకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. చిన్నారి తల్లి మారియా అడేటా వెంటనే ఆపిల్ సపోర్టుకు కాల్ చేసి కంప్లైంట్ చేసింది. దానికి కంపెనీ బాధ్యత వహిస్తూ ఫోన్ పేలడానికి గల కారణాలను విచారిస్తామని వెల్లడించింది. ఈ ప్రమాదంలో పాపకు ఏమీ కాలేదని తల్లి సంతోషంతో ఊపిరి పీల్చుకుంది.

Tags

Read MoreRead Less
Next Story