వైద్యుల తీరుతో చిన్ని ప్రాణం బలి..

వైద్యుల తీరుతో చిన్ని ప్రాణం బలి..

మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్లక్ష్యం పడకేసింది. ప్రభుత్వ ఆసుపత్రులకు తెలంగాణ సర్కార్‌ పటిష్ట చర్యలు తీసుకుంటున్నా.. వైద్యుల తీరు మాత్రం మారడం లేదు. నిర్లక్ష్యంతో సామాన్య ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారు. అలా వైద్యుల తీరుతో ఓ చిన్ని ప్రాణం బలైంది. పురిటినొప్పులతో బాధపడుతు ఆస్పత్రిలో చేరిన గర్బిణీకి సకాలంలో కాన్పు చేయకపోవడంతో పసికందు చనిపోయింది.

రాజాపూర్ మండలం ఈద్గానిపల్లి గ్రామానికి సృజన అనే గర్భిని.. 3రోజుల క్రితం కాన్పుకోసం జిల్లా ఆస్పత్రిలో చేరింది. ఐతే నెలలు నిండినప్పటికీ కాన్పు సమయం కాలేదని..పురుటి నొప్పుల కోసం 3రోజులుగా మందులు ఇస్తు వచ్చారు. పురిటినొప్పులు వచ్చాకనేమో...నార్మల్ డెలివరీ అవుతుందని నమ్మబలికారు. బిడ్డ పురిటి నొప్పులతో బాధపడుతుంది..ఆపరేషన్ చేయాలని ఎంత బ్రతిమిలాడినా పట్టించుకోలేదు. తీరా రాత్రి 3గంటల సమయంలో కాన్పు కోసం ప్రసూతి గదిలోకి తీసుకెళ్లారు. అరగంట తర్వాత శిశువు మృతి చెందిందని వైద్యులు చేతులెత్తేశారు. చావు కబురు చల్లగా వినిపించారు.

వైద్యుల నిర్లక్ష్యం వల్ల సరైన సమయానికి కాన్పు చేయకపోవడంతో తన పసిబిడ్డ మృతిందని కుంటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బాధితులు ఆరోపిస్తున్నారు.వీరే కాదు..కాన్పు కోసం ఆస్పత్రిలో చేరిన ప్రతి ఒక్క గర్భిణీ పరిస్థితి ఇలాగే ఉంది. ఆస్పత్రిలో వైద్యులు సరిగాపట్టించుకోవడం లేదని వాపోపుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story